Bhoomaakila | Ap | Assembly

Ysrcp mla bhuma akhila priya told robbinhood story in ap assembly

ysrcp, bumaakhila, buma nagireddy, ap, assembly, diesel, petorl, chandrababu, robinhood, robberhood

ysrcp mla bhuma akhila priya told robbinhood story in ap assembly. in the ap assembly ysrcp mla, buma nagireddy daughter intrsting coments at ap govt. she said that robinhood stole money from rich and distribute to poor. but ap govt doing robberhood that ap govt collect money from poor and distributed to rich she said.

ప్రభుత్వం పై పంచ్ లతో అదరగొట్టిన భూమాఅఖిలప్రియ

Posted: 03/26/2015 04:08 PM IST
Ysrcp mla bhuma akhila priya told robbinhood story in ap assembly

భూమా శోభానాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియ ఏపి అసెంబ్లీలో అదరగొట్టారు. అది కూడా మామూలుగా కాదు పంచ్ లతో ఫట్ ఫట్ లాగించారు. ప్రభుత్వం అవలంభిస్తోన్న వైఖరిని ఎండగడుతూనే, విమర్శలు గుప్పించారు. తన తల్లి శోభానాగిరెడ్డి దగ్గరి నుండి నేర్చుకుందో ఏమో కానీ ఎంతో కాలం అనుభవమున్న నాయకురాలిలా అన్ని విషయాలపై ప్రభుత్వాన్ని కడిగేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడుతూనే ప్రభుత్వానికి చురకలంటించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్‌ విధించడంతో సామాన్యులను లాభం మాట అటుంచి, నష్టం కలుగుతోందని మండిపడ్డారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వ్యాట్‌ విధిస్తున్నారని అఖిల ప్రియ తెలిపారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు నుంచి రైతులు వరకూ ఇబ్బందులు పడుతున్నారని భూమా అఖిలప్రియ ఏపి అసెంబ్లీలో వెల్లడించారు. మాటలల్లో మాటగా  రాబిన్ హుడ్ ఉదంతాన్నిను ఆమె సభలో ప్రస్తావించారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచుకొని ఆ సంపదను పేదలకు పంచారని తెలిపారు. కానీ  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలను దోచుకుని ఆ సందపను సంపన్నులకు పెడుతోందని వెల్లడించారు. సర్కార్ రాబింగ్ హుడ్ అని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సరికాదన్నారు. రైతులు ట్రాన్స్పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేకహోదా కోసం అధికార, విపక్షాలతో పాటు స్పీకర్ సహా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామని అఖిలప్రియ కోరారు. మొత్తానికి ఏపి అసెంబ్లీలో అఖిల ప్రియ ప్రసంగం అదిరిపోయింది. ఎప్పుడూ తిట్టుకోవడం, వీలైతే అరుచుకోవడం మినహా ఇలా కూడా ప్రభుత్వానికి చురకలు పెట్టొచ్చని అఖిల ప్రియ నిండు సభలో నిరూపించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : ysrcp  bumaakhila  buma nagireddy  ap  assembly  robinhood  robberhood  

Other Articles