TRS | MLC | Elelctions | Hyderabad

Tummala nageshwar rao on mlc elections

trs, bjp, mlc, greater lelctions, elections, deviprasad, thummala

telangana minister thummala nageshwar rao commented on trs defeat in the mlc elections. he said that trs didnt have strong cader in the rangareddy and hyderbad. but up coming greater hyderabad trs will win thummala said.

అక్కడ పడగొట్టలేదు కానీ ఇక్కడ తొడకొట్టారు

Posted: 03/26/2015 01:32 PM IST
Tummala nageshwar rao on mlc elections

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి దెబ్బతగిలింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరబాద్ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్థి చేతిలో తెరాస అభ్యర్థి ఘోర పరాజయాన్ని పొందారు. అయితే బిజెపి అవలంబించిన కొన్ని వ్యూహాలను టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేకపోయింది. అయితే తెలంగాణ తొలి ప్రభుత్వం కెసిఆర్ సర్కార్ తనకు అన్ని రకాలుగా సహకరించిందని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే టిఆర్ఎస్ ఓటమి చెందిందని టిఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ చెప్పొకొచ్చారు. అయితే బ్యాలెట్ బాక్సుల్లో ఏకంగా తెలంగాణ సిఎం కెసిఆర్ కు వచ్చిన హెచ్చరికలే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా అయింది కానీ ముందు కాదు అంటూ తొడకొడుతున్నాడు అధికార పక్షానికి చెందిన ఓ మంత్రి.

తెలంగాణలో తమ పార్టీకి తిరుగులేదని నిన్నటి దాకా జబ్బలు తడిచిన వారు ఒక్క సారిగా ఖంగుతినేలా బిజెపి పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందారు. అయితే అన్ని పార్టీలు కలిసి టిఆరఎస్ అభ్యర్థిని ఓడించాయని టిఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఎంతలా వ్యతిరేకత లేకపోతే మాత్రం దేవీ ప్రసాద్ అలా ఘోరంగా ఓడిపోతారు అనే వాదన వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే అలా ఓడిపోయాం కానీ ఈ సారి జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలిచితీరుతామంటున్నారు తెలంగాణ మంత్రి. హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో టీఆర్‌ఎస్‌కు సంస్థాగత నిర్మాణం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా చాలా ఎక్కువ సంఖ్యలో తాము ఓట్లు సాధించామని పార్టీ నుండి వఖాల్తా పుచ్చుకున్నారు. కానీ గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చూపిస్తామని తుమ్మల తొడగాట్టారు. మరి తుమ్మలు నాగేశ్వర్ రావు అన్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో పడగొడతారో లేదా పడిపోతారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trs  bjp  mlc  greater lelctions  elections  deviprasad  thummala  

Other Articles