aap | NCM | rift | kejriwal

Battle lines drawn ahead of aaps national council meeting

aap, kejriwal, rift, prashanthbhushan, yogendrayadav, NCM, aam admi party

Aam Aadmi Party’s internal Lokpal Admiral Ramdas's meeting with Arvind Kejriwal on Wednesday evening could be the last effort to save the party’s fragile unity. Before the crucial National Council meeting of the party, on March 28, battle lines between the Prashant Bhushan-Yogendra Yadav ‘camp’ and the Arvind Kejriwal ‘camp’, are again emerging, despite non-stop negotiations between both sides.

ఆప్ వారిని సాగనంపుతుందా.. సర్దుకుపోతుందా

Posted: 03/26/2015 10:28 AM IST
Battle lines drawn ahead of aaps national council meeting

ఆప్ లో ముదురుతున్న వివాదాలు అంతకంతకూ ముదురుతున్నాయి. అయితే శుక్రవారం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆప్ కీలక నేతలుగా మెలిగి, ప్రస్తుతం పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల విషయంలో ఏదో ఒక కీలక నిర్ణయం వెలుడే అవకాశం ఉంది. అయితే గత కొంత కాలంగా ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ల తరఫున అరవింద్ కేజ్రీవాల్ తో సాగుతున్న చర్చలు విఫలమవుతూ వచ్చాయి. దాదాపుగా ఇద్దరు నేతలకూ పార్టీ నుండి వీడ్కోలు వస్తుందని ఇప్పటికే తేలిపోయింది. అయితే కొంత మంది ఆప్ నేతలు మాత్రం ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు మరో అవకాశాన్ని ఇవ్వాలని, వారి వాదనకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆప్ కమిటిని అడుగుతున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆప్ కన్వీనర్ గా రెండు పదవులను అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి రాజీనామా చెయ్యాలని పార్టీలో ఇద్దరు నేతలు మంటలు రేపారు. అయితే పార్టీలో అంతర్గతంగా ఉండాల్సిన విషయాలను లేఖల రూపంలో ఇరువురు నేతలు బహిర్గతం చెయ్యడం వివాదాస్పదంగా మారింది. అయితే ఎన్నికల సమయానికి ముందు నుండి ఇద్దరు నేతలు కేజ్రీవాల్ తో విభేదించారని ఆప్ బాంబు పేల్చింది. అయితే ఆప్ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ తనకు టైం ఇస్తే అన్ని విషయాలను చర్చిస్తానని ప్రశాంత్ భూషణ్ గతంలో ప్రకటించారు. కానీ బెంగళూరు నుండి తిరిగి వచ్చిన తరువాత కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పార్టీని ఏర్పాటు చెయ్యడం దగ్గరి నుండి అన్ని రకాలుగా పార్టీకి అండగా నిలిచిన ఇద్దరు కీలక నేతలను పార్టీ కీలక పదవుల నుండి తొలగించాలని గతంలో పార్టీ సభ్యులు నిర్ణయించారు. అయితే దానిపై కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ చర్చలకు సిద్దమని చెప్పినా, కేజ్రీవాల్ నుండి ఎలాంటి ప్రయత్నం లేకపోవడంతో కాస్త నిరుత్సాహంగా ఉన్నారు ప్రశాంత్ భూషణ్ వర్గం. కేజ్రీవాల్ కు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను సాగనంపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మరి కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటి లో తిరిగి వారికి చోటు దక్కే అవకాశం ఉందో లేదో శనివారం తేలిపోతుంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పాటు, ల్యాండ్ బిల్ లాంటి కీలక అంశాలపై పార్టీ క్యాడర్ చర్చించనుంది. రానున్న ముంబాయి పై ఆప్ మరింత దృష్టి సారించాలని, ఆ దిశగా పావులు కదుపుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  rift  prashanthbhushan  yogendrayadav  NCM  aam admi party  

Other Articles