India prattle to chase west indies target

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

india prattle to chase West Indies target of 183 runs

టార్గెట్ చేధనలో తడబడుతున్న టీమిండియా

Posted: 03/06/2015 06:20 PM IST
India prattle to chase west indies target

ప్రపంచ కప్ టోర్నమెంటులో టీమిండియా బ్యాట్స్ మెన్ తడబాటుకు గురవుతున్నారు. విండీస్ విసిరిన 183 పరుగల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం చెందింది. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్ మెన్లు విలవిలలాడుతున్నారు. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించేందుకు బదులు ప్రత్యర్థి బౌలర్ల జోరుకు మోకరిల్లుతోంది. గ్రూప్ బిలో భాగంగా పెర్త్ లో జరుగుతున్న మ్యాచ్ లో ధోణి సేన 11 పరుగులకే తొలి విక్కెట్ ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 9 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.  ఆ తరువాత రోహిత్ శర్మ పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ 20 పరుగలకే పెవీలియన్ దారి పట్టారు.

ఆ తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ.. అజ్యింక రహానేలు కొద్ది సేపు నిలకడగా ఆడి భారత్ స్కోరును 60 పరుగుల వద్దకు చేర్చారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో షాట్ బాల్ ను పుల్ చేసి కొట్టడంలో విఫలం చెందిన కోహ్లీ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెనువెంటనే అజ్యింక రహానే కూడా ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన సురేష్ రైనా కూడా పెవీలియన్ దారి పట్టాడు. ఆ తరువాత వచ్చిన జెడేజా కొద్ది సేపు ఆచితూచి ఆడినా.. ఆ తరువాత హుక్ షాట్ కొట్టేందుకు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ 30 ఓవర్లలో 135 పరుగులు సాధించడానికి శ్రమించింది. టీమిండియా.. ఆపసోపాలు పడుతూ ఆరు విక్కెట్లను చేజార్చుకోగా.. ప్రస్తుతం ధోణి, అశ్విన్ క్రీజ్ లో వున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles