Rahul gandhi will be back in next week

rahulgandhi, aicc, congress, elections, leave, parliament

Congress vice-president Rahul Gandhi, who is on a leave of absence from Parliament to focus on party work following its wipe-out in the Delhi polls, will be back in action early next week, said former Union Minister Kamal Nath in New Delhi.

రాహుకాలం ముగిసింది.. త్వరలో రాహుల్ రాక

Posted: 03/06/2015 01:55 PM IST
Rahul gandhi will be back in next week

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చేవారం రంగంలోకి జనం ముందుకు రానున్నారు. వచ్చేవారం కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ వెల్లడించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు రాహుల్‌గాంధీ వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే త్వరలో జరిగే  ఏఐసీసీ సమావేశాల కోసమే రాహుల్ సెలవు పెట్టారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. పార్టీని పూర్తిస్థాయిలో మార్పులు చేస్తారని,  కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తేవాలని రాహుల్‌ భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడానికి రంగం సిద్ధమైందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలరని, ఆ శక్తిసామర్ధ్యాలు రాహుల్‌కు ఉన్నాయని ఆయన దీమా వ్యక్తం చేశారు.

మొత్తానికి కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా మాయమైన రాహుల్ గాంధీ ప్రత్యక్షం కానున్నారు. అయితే ఈ సారి రాహుల్ ఎంతో కీలకంగా వ్యవహరిస్తారని, పార్టీని ముందుకు తీసుకు వెళతారని కాంగ్రెస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ లో ఓ వర్గం రాహుల్ గాంధీని కావాలనే తక్కువ చేసి మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే రాహుల్ సీనియర్లపట్ల సరిగా వ్యవహరించరని, అందుకే వారు రాహుల్ కు పూర్తిస్థాయిలో సహకరించలేదని విమర్శ. అయితే గతంలో జరిగిన తప్పులను రాహుల్ సరిచేసుకుంటారని, పార్టీని కొత్త ఆలోచనలతో ముందుకు నడుపుతారని కాంగ్రెస్ లోని రాహుల్ గాంధీ బృందం గట్టిగా నమ్ముతోంది. అయినా తిరిగి వచ్చిన రాహుల్ వైఖరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahulgandhi  aicc  congress  elections  leave  parliament  

Other Articles