Government serves legal notice to bbc

nirbhaya, daughterofindia, documentary, bbc, lesle udwin, legalnotice

government serves legal notice to bbc: India's Daughter by British filmmaker Leslee Udwin for the british broadcast corporation which carries an interview with Mukesh Singh, who brutally raped a 23-year-old woman on December 16, 2012. The documentary has bring firestorm in India,

బిబిసి చానల్ కు కేంద్రం నోటీసులు.. ప్రసారమైన డాక్యుమెంటరీ

Posted: 03/06/2015 10:03 AM IST
Government serves legal notice to bbc

బిబిసి ఛానల్ కు కేంద్ర ప్రభుత్వం లీగల్ నోటీసు జారీచేసింది. నిర్భయ కేసు రేపిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా లెస్లీ ఉడ్విన్ రూపొందించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీపై కోర్టు, కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ బిబిసి విదేశాల్లో ప్రసారం చేసింది. బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటంతో అది సోషల్ మీడియా ద్వారా అత్యంతవేగంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా స్పందించిన కేంద్రప్రభుత్వం, బీబీసీతోపాటు యూట్యూబ్, సోషల్‌మీడియా వెబ్‌సైట్లకు కోర్టు సమన్లు పంపింది. డాక్యుమెంటరీ బయటకు రావటానికి కారణమైన బీబీసీపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు లీగల్ నోటీసు కూడా జారీచేసినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో వెబ్‌సైట్లను బ్లాక్‌చేస్తామని అధికారవర్గాలు గట్టిగా హెచ్చరించాయి. మరోవైపు డాక్యుమెంటరీ నిషేధాని కాంగ్రెస్ పార్టీతోపాటు దేశవ్యాప్తంగా మేధావులు, సెలబ్రిటీలు తప్పుపట్టగా, బీజేపీ సమర్థించింది. ఈ డాక్యుమెంటరీలో నిర్భయ దోషి ముకేశ్‌సింగ్ అభిప్రాయాలు షాక్‌కు గురిచేశాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ ప్రతినిధి పేర్కొన్నారు. డాక్యుమెంటరీని ప్రతి ఒక్కరూ చూడాలని నిర్భయ తండ్రి బద్రినాథ్‌సింగ్ సూచించారు.
 
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి కారణమైన నిర్భయ కేసుపై బిబిసి తీసిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారానికి దారితీసింది. ప్రతిపక్షాలు అధికారపక్షంపై తీవ్రంగా మండిపడ్డాయి. మరో పక్క ప్రభుత్వం కూడా డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, లాభంలేకుండా పోయింది. నిజానికి ప్రపంచ మహిళా దినోత్సవం నేపధ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినా, అనుకున్న దాని కంటే ముందే బిబిసి డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే భారత్ లొ డాక్యుమెంటరీని ప్రసారం చెయ్యడం లేదని ముందే బిబిసి ప్రకటించింది. మొత్తానికి బిబిసి అనుకున్న విధంగానే డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  daughterofindia  documentary  bbc  lesle udwin  legalnotice  

Other Articles