Teen gang raped haryana allegedly commits suicide

teen gang raped in haryana, teen gang raped in sonipat, haryana gang rape victim commits suicide, sonipat gang rape victim commits suicide, haryana police denies to register a gang rape case, sonipat police denies to register a gang rape case, voilence on woman, crime on woman, rape on woman, woman gang raped, police registers fir, rape cases in india, latest news on woman rape, latest news on gang rapes,

teen aged victim of gang rape in Haryana committed suicide after police denies to register a gang rape case

న్యాయం జరగలేదని గ్యాంగ్ రేప్ బాధితురాలి అత్మహత్య

Posted: 03/05/2015 09:23 PM IST
Teen gang raped haryana allegedly commits suicide

హర్యానాలో దారుణం జరిగింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్య పాల్పడింది. సోనీపట్ జిల్లాలోని గొహానా నగరానికి చెందిన యువతిని కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. ఫిబ్రవరి 6వ ఈ దారుణం జరిగిన తరువాత.. సదరు బాధితురాలు నిందితులపై పోలీసులకు పిర్యాదు చేసింది. తనపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకుంది.

సోనిపట్ జిల్లా పోలీసులు మాత్రం బాధితురాలి పిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించారు. కేవలం ఒక్క నిందితుడిపైనే కేసు నమోదు చేసి.. అత్యచార చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులు తనకు న్యాయం చేస్తారని ఆశించినా.. వారు ఒక్కడిపైనే కేసును నమోదు చేయడం పట్ల కలత చెందిన బాధితురాలు తీవ్ర మనోవేధనకు గురైంది. గ్యాంగ్ రేప్ తో తాను సర్వం కోల్పోయానని, ఈ క్రమంలో పోలీసులు ఇష్టానుసారంగా కేసు నమోదు చేసి ఒక్కడినే అరెస్టు చేయడం అవమానంగా భావించింది.

తనపై విరుచుకుపడిన మృగాళ్లు మళ్లీ తన కళ్ల ముందే తిరగడంతో పరాభవంగా భావించిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఆమె వాంగ్మూలం పత్రాన్ని కూడా ఫోర్జరీ చేశారని, నిందితుల్లో చాలామంది స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆమె బంధువులు పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haryana  girl  suicide  gang rape  police  

Other Articles