Fir lodged against canada nris who threatend to shoot anna hazare

Anna Hazare gets death threats on Faceook, FIR lodged against 2 Canada based NRI, Anti-graft crusader Anna Hazare, modern gandhi modern nathuram godse, Anna hazare footmarch protest, Anna to fight agaist Land Acquisition Bill, Anna Hazare, Anna Hazare death threat, Land Acquisition Bill protest, canada, police,

Anti-graft crusader Anna Hazare, who is set to undertake a footmarch protesting the Land Acquisition Bill, has received life threats on social networking site Facebook,

హజారేను చంపుతామన్న ప్రవాసభారతీయులపై కేసు

Posted: 03/05/2015 03:07 PM IST
Fir lodged against canada nris who threatend to shoot anna hazare

సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త గాంధేయవాది అన్నా హజారేను హతమారుస్తామని. అందుకు సమయం ఆసన్నమైందంటూ ఫేస్‌బుక్ పోస్టింగ్ చేసిన కెనడాకు చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులపై కేసు నమోదైంది. భూ సేకరణ చట్టంలో సవరణలను వ్యతిరేకంగా ఈ నెలలో 11 వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న గాందేయవాదిని చంపేస్తామంటూ ఫెస్ బుక్ లో పోస్టు చేసిన గగన్ విదు సహా అతని మిత్రుడు నీల్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

అన్నా సహచరులలో ఓకరైన మహారాష్ట్ర ధానే సమీపంలోని కళ్యాణ్ కు చెందిన అశోక్ గౌతమ్ అనే కార్యకర్తకు గత మూడు వారాలుగా బెదిరింపు హెచ్చరికలు పోస్టు చేస్తునే వున్నారు. దీంతో ఆందోళన చెందిన ఆయన ఎఫ్ ఎం సీ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. గౌతమ్ పిర్యాదుపై స్పందించిన పోలీసులు కెనెడాలో వున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఐసీపీ 506(2)తో పాటు ఐటీ చట్టం 66(ఎ) కింద కేసును నమోదు చేశారు. నిందితులు ఎక్కడి నుంచి ఫేస్ బుక్ లో బెదిరింపు హెచ్చరికలను పోస్ట్ చేశారన్న తెలుసుకునే పనిలో పడ్డారు. వారి ఐఫీ అడ్రస్ కనుగోనే పనిలో వున్నారు.

తాను కాబోయే నాథూరాం గాడ్సేనంటూ గగన్ విధు అనే ఎన్నారై తన ఎఫ్‌బి అకౌంట్‌లో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.. గాంధేయవాది అన్నాను చంపడానికి తానే గాడ్సే అవుతానంటూ గగన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్నా హజారేకు మరింత భద్రత పెంచారు. కాగా, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమించడం ఇష్టంలేని వారు ఈ రకమైన  బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna Hazare  Anna Hazare death threat  Land Acquisition Bill protest  canada  

Other Articles