Most polluted cities are all in india

most-polluted cities are all in India, Hyderabad ranks top in Quality of Living, Hyderabad emerged as best quality of living city in India, World Health Organization (WHO) data on world pollution, pollution impacts overall scores of Indian cities, Ruchika Pal, India practice leader Ruchika Pal, Mercer, population increases in Mumbai and New Delhi, hyderabad city of choice due to factors, Vienna best quality of living in the world for the second consecutive time.

Hyderabad has emerged as the city with the best quality of living in India, better than Mumbai and New Delhi.

కాలుష్య కసారాపునగరాలు మన నగరాలకు గుర్తింపు

Posted: 03/05/2015 02:05 PM IST
Most polluted cities are all in india

విశ్వవ్యాప్తంగా కాలుష్యపు నగరాలు ఎక్కడున్నాయంటే.. భారత్ అని టక్కున సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే వున్నాయి. నమ్మశక్యం కావడం లేదు కదూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రపంచ వ్యాప్తంతా అత్యంత కాలుష్య కాసారపు నగరాలుగా 20 నగరాల పేర్లను విడుదల చేయగా, వాటిలో 13 నగరాలు మన దేశంలోనే వున్నాయంటే విడ్డూరం కలలుగుతుంది కదూ..? కానీ ఇది నిజం. భారత పర్యావరణ పరిశోధకులు రచికా పాల్ కూడా మన నగరాల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా మన భాగ్యనగరానికి మాత్రం అరుదైన గుర్తింపు దక్కింది. మన దేశంలో మెరుగ్గా జీవించేందుకు అత్యుత్తమమైన నగరం హైదరాబాద్ అని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్టు-2015 ప్రకటించింది. ఏటా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ పేరిట సర్వేను నిర్వహిస్తుంటుంది. ఈ నివేదికలో హైదరాబాద్ నగరం ప్రపంచస్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకోగా, దేశంలో మాత్రం తొలిస్థానం ఆక్రమించుకుంది. విశ్వవ్యాప్తంగా మొత్తం 440నగరాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించగా, ఆస్ట్రేలియాలోని వియన్నా సుందర నగరంగా తొలిస్థానాన్న వరుసగా రెండో పర్యాయం నిలువగా, రెండో స్థానాన్ని స్విట్జర్లాండ్‌లోని జూరిచ్, తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని మూనిచ్, కెనడాలోని వాంకోవర్ నగరాలు నిలిచాయి. చివరి స్థానంలో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఉంది.

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ నివేదిక ప్రకారం ప్రపంచస్థాయిలో హైదరాబాద్ 138వ స్థానంలో నిలువగా,  ఆ తరువాత పుణె 145, బెంగళూరు 146, చెన్నై 151, ముంబై 152, న్యూఢిల్లీ 154, కోల్‌కతా 160 స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌లో ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో హైదరాబాద్ నగరం తొలిస్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో భారీ జనాభా ఉన్నప్పటికీ తక్కువ కాలుష్యం ఉండటం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. దేశంలో మంచి వాతావరణం హైదరాబాద్ సొంతమని వ్యాఖ్యానించింది.

హైదరాబాద్ తర్వాత రెండోస్థానంలో పుణె, మూడోస్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో చెన్నై, ఐదో స్థానంలో ముంబై, ఆరో స్థానంలో న్యూఢిల్లీ, ఏడో స్థానంలో కోల్‌కతా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై వంటి నగరాల్లో నానాటికీ పెరుగుతున్న జనాభాకు తోడు జనసాంధ్రతకు కావాల్సిన మౌలిక వసుతలు కల్పన లేదని తెలిపింది. దీనికి తోడు కాలుష్యం పెరిగిపోతుండటం, వసతులు కరువవడం, తాగునీరు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన ట్రాఫిక్ సమస్య కారణాలతో ప్రజలు ఉండేందుకు ఆసక్తి కనబర్చడం లేదని నివేదికలో వెల్లడైంది

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  pune  top poluuted cities  mumbai  delhi  

Other Articles