Alert don t take calls starting with 92

Don’t take calls starting with +92, Telangana CID released a list of don'ts for public, +92 code of pakistan, +92 pakistan country code, cid police warns public, cid police advices people, cid police intructions to public,

Telangana Crime Investigation Department (CID) has released a list of “don'ts” for the public in order to prevent people from being victims of cyber attacks.

ఆ నెంబరుతో ఫోన్, మెసేజ్ లు వస్తే.. .జరభద్రం..!

Posted: 03/04/2015 09:18 PM IST
Alert don t take calls starting with 92


ఫోన్ రింగ్ అవ్వడమే ఆలస్యం లిఫ్ట్ చేసి మాట్లాడే వాళ్ల సంఖ్య ఎక్కువేనని చెప్పాలి. ఇక మరికోందరు ఎవరి నెంబరు వచ్చిందో కూడా చూసుకోకుండా ఏకంగా ఫోన్ కు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని తెగ  మాట్లాడేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారే కదూ.. ప్రతీ ఒక్కరే జాగ్రత్త వహించాల్సిన అవసముందంటున్నారు పోలీసులు. తెలంగాణ క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు కు చెందిన అధికారులు ప్రజలకు తమ సెల్ ఫోన్లలో ఏమి చేయాకూడదో తెలుపుతూ.. పలు సూచనలు చేశారు.

+92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని సీఐడీ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలంటే తాము సూచనలు ఫాలో కావాలను తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ తీయవద్దని, ఈ మెయిల్స్‌ను దూరం ఉంచాలని చెప్పారు.  +92తో ప్రారంభమయ్యే నంబర్ల మీద కాల్‌ వస్తే ఫోన్‌ తీయవద్దని పేర్కొన్నారు. ఇలాంటి అంకెలతో ప్రారంభమయ్యే నంబర్లతో ఎక్కువగా పాకిస్థాన్‌ నుంచి ఫోన్లు వస్తాయన్నారు.  +92 పాకిస్థాన్ దేశానికి చెందిన కోడ్ అని కూడా వివరించారు.

దీంతో పాటు తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటూ వారు నమ్మబలుకుతారన్నారు. అలాగే బీమా, ఆదాయపు పన్ను రిటర్న్‌ల కోసమంటూ బ్యాంకు ఖాతా నంబర్లు, ఏటీఎం పిన్‌ నంబరు చెప్పాలని వచ్చే ఫోన్లకు జవాబివ్వవద్దన్నారు. బ్యాంకులు ఏవీ కూడా ఖాతాదారుడి డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల పిన్ నంబర్లు కోరవని చెప్పారు. నలుపు రంగు కాగితాలను రసాయనాల్లో ముంచితే డాలరుగా మారుతుందని కొందరు మాయచేయజూస్తారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిట కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone call  hyderabad  telangana  

Other Articles