Police arrested fraud women male escort provider

Police arrested fraud women, women cheated unemployed, woman cheated luring with Male Escort jobs, fraud Male Escort Provider, Hyderaabd police arrested Farheen naaz, old city woman Farheen naaz arrested, crime in hyderabad, unemployed in hyderabad,

Hyderaabd police arrested a Women named Farheen naaz in a case of cheating by luring with Male Escort jobs.

‘మాయలాడి’.. అలా అని నిరుద్యోగులను నిండా ముంచింది..

Posted: 03/04/2015 01:24 PM IST
Police arrested fraud women male escort provider

మాయలాడి.. మాయ మాటలు చెప్పి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి నాలుగేళ్లుగా వారి డబ్బుతో జల్సాలు చేస్తోంది. నిరుద్యోగులకు ఇప్పిస్తానని చెప్పిన ఉద్యోగాలే ఇక్కడ చర్చనీయాంశంగా మారాయి.  'మగ వ్యభిచారులుగా (మేల్ ఎస్కార్ట్స్)గా ఉద్యోగం  చేయాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. మంచి జీతం, కమీషన్ ఇస్తాం..ఇంకెందుకు ఆలస్యం... మమ్మల్ని సంప్రదించండి'.... అంటూ నిరుద్యోగ యువతకు గాలం వేసింది. ఇంటర్నెట్‌, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రకటనలిచ్చి.. నిరుద్యోగ యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఈ ప్రకటనకు ఫ్లాట్ అయ్యారు. పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన మహిళలతో పరిచయంతో పాటు కాలం కలసి వస్తే.. ఏదో విధంగా సెటిల్ కావచ్చు అన్న దురాశ కూడా నిరుద్యోగులను అమె వలలో పడేట్టు చేసింది. సునాయాసంగా డబ్బు సంపాదించవచ్చునన్న పేరాశ కూడా ఆ ప్రకటన పట్ల ఆకర్షితులను చేసింది. నిరుద్యోగుల నుంచి రిజిస్ట్రేషన్‌ కోసం 5వేల నుంచి 7వేల వరకు వసూలు చేసింది. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే మూడున్నర లక్షల వరకు వసూలు చేసింది.

అయితే డబ్బు ముట్టిన తర్వాత ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తతంగానంతా నడిపింది పాతబస్తీకి చెందిన ఫర్హీన్‌ నాజ్‌ అని తెలుసుకున్న పోలీసులు.. అమెపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు అమెను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అమె ఆద్వర్యంలో నడుస్తున్న సిమ్రాన్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ పేరుతో వెబ్‌సైట్‌ బ్లాక్ చేశారు. నాలుగేళ్లుగా ఫ్రెండ్స్ క్లబ్ మాటున ఫర్హీన్ నాజ్ మోసం చేస్తున్నట్లు సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో బయటపడింది.  ఆమె దగ్గర నుంచి ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fraud women  Male Escort Provider  Farheen naaz  

Other Articles