Global supporters on aap

aap, kejriwal, prashanthbhushan, nri, yagendrayadav

With the rift in AAP deepening, non-resident Indian supporters of the party have appealed to its leadership to stand united and resolve all their differences peacefully.

'విభేదాలు పక్కన పెట్టండి'.. విదేశాల నుండి ఆప్ నేతలకు సూచనలు

Posted: 03/04/2015 12:26 PM IST
Global supporters on aap

అవినీతికి వ్యతిరేకంగా ఆప్..కొత్త రాజకీయాలకు ఆప. ఇలా సర్వరోగ నివారిణి మా పార్టీయే అని ఊదరగొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ లో తాజాగా వివాదాలు మొదలయ్యాయి. పార్టీ సిద్దాంతాలను ఎవరూ అతిక్రమించరాదన్న విధానాన్ని మరిచి జోడు పదవులు అనుభవించడం ఏంటని ఒకరు, పార్టీ రాజకీయ వ్యవహారాల్లో లోపాలున్నాయని మరొకరు ఇలా ఇద్దరు కీలక నేతలు పార్టీ పై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో జరుగుతున్న వివాదాలకు తెర దించాలని ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది పార్టీ. అయితే పార్టీలో జరుగుతున్న వివాదాలపై మీడియా కోడై కూస్తుండటంతో ఆప్ అభిమానులు నేతలకు సలహాలు, సూచనలు పంపుతున్నారు.

ఘంటి బజావో..అంటూ ఎన్నారై ఆప్ అభిమానులు, సభ్యులు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆప్ లో జరుగుతున్న వివాదాలు మామూలువని, వాటిని కూర్చొని పరిష్కరించుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే పార్టీ వివాదాలు చాలా మందికి అసహ్యాన్ని కలిగిస్తున్నాయని వారు అంటున్నారు. అసలు పార్టీలో సమస్యల కన్నా, తమ ముందు అవినీతి, లోక్ పాల్ లాంటి చాలా సమస్యలు ఉన్నాయని, స్వచ్ఛమైన పాలనను అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆప్ ఎన్నారై సభ్యులు హితవు పలుకుతున్నారు. అన్ని పార్టీలకు మేం భిన్నం అని చెప్పుకున్న తాము ఇలా చిన్న విషయాలకు కుంగిపోవద్దని పిలుపునిచ్చారు. ఆప్ లో కీలకంగా వ్యవహరిస్తున్న వారందరికి యుకె, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్,ఖతార్,సింగపూర్ ఇలా దాదాపు 32 దేశాల నుండి మెసేజ్ లు వస్తున్నాయి. మొత్తానికి ఆప్ వివాదం దేశం దాటి అన్ని దేశాలకు వ్యాపించింది. టీవీ సీరియల్ లాగా రోజుకో ఎపిసోడ్ నడుస్తున్న ఆప్ అంకానికి ఎప్పుడు తెరపడుతుందో.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  prashanthbhushan  nri  yagendrayadav  

Other Articles