Rbi cuts repo rate to 7 5 percent

RBI cuts repo rate to 7.5 percent, Reserve Bank of India, RBI cut its key policy rate, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in March, Reporate Reverse Repo Rate, CRR SLR MSF

The Reserve Bank of India unexpectedly cut its key policy rate, the repo rate, by another 25 basis points to 7.5 percent, committing itself wholeheartedly to push for growth as inflation is on the softer side.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. వృద్దిరేటు పెంపుపైనే దృష్టి..

Posted: 03/04/2015 10:33 AM IST
Rbi cuts repo rate to 7 5 percent

ద్రవ్యోల్భనం నిలకడగా వుంటేనే కాని రెపో రేటును తగ్గించలేమని ముందు నుంచి చెబుతూ వస్తున్న రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఇవాళ ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత రెండు మూడు పర్యాయాలుగా సమావేశేమైన ఆర్బీఐ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఒకానోక దశలో జీడీపీ పెంపుకు, దేశంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రెపో రేటును తగ్గించాల్సిన అవసరం వుందని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అభిప్రాయపడ్డారు.

అయినా లొంగని రఘురామ్ రాజన్ ఇవాళ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్భణం కూడా గత కొన్ని మాసాలుగా స్థిరంగానే కోనసాగుతుండటం కూడా ఆయన నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు. రెపో రేటును 0.25 శాతాన్ని తగ్గించింది. ఆర్బీఐ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు రెపోరేటును తగ్గించింది. అయితే నగదు నిల్వల నిష్పత్తిని మాత్రం యథాతధంగా ఉంచింది.  ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న ఖాతాదారులకు శుభవార్తే. తగ్గించిన రెపోరేటు తక్షణమే అమల్లోకి రానుంది. దాంతో 7.5గా ఉన్న రెపోరేటు 7.25కి చేరింది. దీంతో రోజు రోజుకు క్షీణిస్తున్న వృద్ధిరేటును పెంచే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. దేశంలోకి విరివిగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RBI  RBI rate cut  Repo rate  

Other Articles