Trs leaders were trained by chandrababu

chandrababu, ap, telanagana, krishnapatnam, electricity, irigatuion, tdp

tdp president, ap cm chandrababunaidu announce that the trs party leaders were trained by him. in the telangana budget got acess with my governence he added. babu told lets talk on major issues like krishnapatnam and other.

ఒకరిద్దరు తప్ప అందరు నా దగ్గరే నేర్చుకున్నారు: చంద్రబాబు

Posted: 03/04/2015 10:14 AM IST
Trs leaders were trained by chandrababu

టిఆర్ఎస్ నాయకుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ తన వద్దే శిక్షణ తీసుకున్నారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండడానికి కారణం తన హయాంలో జరిగిన అభివృద్దేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా తెలుగు ప్రజలు మానసికంగా కలిసిమెలిసి ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. కరెంట్‌ సహా ఏ అంశంపైనైనా కూర్చుని మాట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. రాజకీయం వేరు. ప్రభుత్వాలు వేరు. కూర్చుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ఏ విషయంలోనైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి అని బాబు సలహా ఇచ్చారు. కృష్ణపట్నం సహా మిగిలిన పవర్‌ ప్రాజెక్టులపై కూర్చుని మాట్లాడుకుందామని, కుదరకపోతే ఒక కమిటీని సిఫార్సు చేద్దామని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

తెలంగాణకు ఏ ఇబ్బంది వచ్చినా ఏపీ ప్రభుత్వపరంగా సహకరించడానికి తాము సిద్ధమని, తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే సమైక్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలయ్యాయని బాబు చెప్పారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ వంటివి ప్రారంభించామని తెలిపారు. టీఆర్‌ఎస్‌లో ఒకరిద్దరు నాయకులు మినహా అంతా తన వద్ద శిక్షణ పొందినవారేనని చంద్రబాబు అన్నారు. అవునా కాదా అని కార్యకర్తలను ఉద్దేశించి ప్రశ్నించారు, కార్యకర్తలు అవును అని సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందితే జాతి సంపద పెరుగుతుందన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేపట్టానని, ప్రపంచమంతా తిరిగానని చంద్రబాబు చెప్పారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap  telanagana  krishnapatnam  electricity  irigatuion  

Other Articles