Sensex hits 30 000 on repo rate cut

sensex,bse, nifty, rbi, govt, sharemarket, reporate, reverse repo rate,

The Sensex and Nifty registered fresh lifetime high levels in trades on Wednesday bolstered by a surprise repo rate cut by the Reserve Bank of India.

భలే మంచి రోజు.. ముప్పైవేల పాయింట్లు దాటిన మార్కెట్

Posted: 03/04/2015 09:56 AM IST
Sensex hits 30 000 on repo rate cut

కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో అటుఇటు ఊగిసలాడి కాస్త లాభాలతో ముగిసింది స్టాక్ మార్కెట్. బడ్జెట్ పై భారీ అంచనాలు పెట్టుకున్న ఇన్వెస్టర్లకు కేంద్రం పెద్దగా లాభం కలిగించలేదు. బడ్జెట్ ప్రసంగానికి ముందు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్నంత వరకు నష్టాలను మూటగట్టుకుంది. తర్వాత స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కాస్త లాభాలతో ఫరవాలేదనిపించింది. మొత్తానికి బడ్జెట్ తర్వాత ఇన్వెస్టర్లకు మంచి బ్రేక్ లభించింది.

ఈ రోజు ఉదయం ప్రారంభం నుండి స్టాక్ మార్కెట్లు మంచి జోరుగా కొనసాగుతున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు భలే మంచి రోజు, పసందైన రోజు అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. ఈ రోజు ఏ నక్క తోక తొక్కామా అన్నట్లు రికార్డు స్థాయిలో లాభాలు నమోదవుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపొరేట్ ను తగ్గిస్తు తీసుకున్న నిర్ణయం మార్కెట్లను పరుగులు పెట్టించింది. 8996.06 వద్ద ప్రారంభమైన నిఫ్టి 9116.95 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు బిఎస్సి 29664.03 వద్ద ప్రారంభమై 30,015.28 పాయింట్ల రికార్డు స్థాయికి చేరుకుంది.దాదాపుగా 279 పాయింట్ల మేర బియస్సి, నిఫ్టి 79 పాయింట్ల మేర లాభపడ్డాయి. డిఎల్ఎఫ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహేంద్ర, ఎస్.బి.ఐ,గుజరాత్ మినరల్, పి.ఎమ్.సి ఫిన్ కార్ప్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్ లు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  bse  nifty  rbi  govt  sharemarket  reporate  reverse repo rate  

Other Articles