Modi govt defeated in rajyasabha of parliament

modi, opposition, congress, karat, bsp, voting, ansari, venkaiahnaidu, ravishankar, rajyasabha, defeat, yechuri

The government's minority status in the Rajya Sabha was driven home by the opposition as it used its numbers to amend a motion of thanks on the President's speech.

ఓడిన మోదీ సర్కార్.. ఓటింగ్ లో మోదీకి ఝలక్

Posted: 03/04/2015 09:38 AM IST
Modi govt defeated in rajyasabha of parliament

భారీ మెజార్టీతో గెలిచిన మోదీ ప్రభుత్వానికి అనుకోని అడ్డుతగిలింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపట్ల ప్రతిపక్షాలు కళ్లాలువేశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే బిల్లులో సవరణలు చెయ్యాలన్న విపక్షాల మాటనెగ్గింది. ఓటింగ్ లేకుండా చూడాలనుకున్న ప్రభుత్వానికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాల సవరణ కోరుతూ ఓటింగ్కు పట్టుబట్టాయి. ధన్యవాద తీర్మానానికి సవరణలు ప్రతిపాదించి, విపక్షం విజయం సాధించడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది నాలుగోసారి కావడం గమనార్హం. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడం గురించికానీ, ఉన్నతస్థాయిలో అవినీతిని నియంత్రించడం గురించి కానీ రాష్ట్రపతి ప్రసంగంలో సవరణను సీపీఎం సభ్యులు ఏచూరి సీతారాం, పి.రాజీవ్‌ ప్రతిపాదించారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో నల్లధనం అంశం ఉందని, ఈ సవరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. సీతారాం ఏచూరిని ఒప్పించేందుకు ప్రయత్నించారు.

ఎంతకీ విపక్షాలు మెట్టు దిగకపోవడంతో ఓటింగ్ అనివార్యం అయింది. కాగా రాజ్యసభలో మెజార్టీలేని ప్రభుత్వం ఓటింగ్ లో ఓడిపోయింది. సభాధ్యక్షుడు అన్సారీ ఈ సవరణ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో విపక్ష తీర్మానానికి అనుకూలంగా 118 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 57 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఎం తీర్మానానికి కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇవ్వడంతో ఈ విజయం సాధ్యమైంది. మొత్తాని మోదీ సర్కారు రాజ్యసభలో చాలా బలహీనంగా ఉందనే విషయం రుజువైంది. అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణల బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాల్సిన సమయంలోఇలాంటి పరిణామాలు మోదీ సర్కార్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  opposition  congress  karat  bsp  voting  ansari  venkaiahnaidu  ravishankar  rajyasabha  defeat  yechuri  

Other Articles