Telanagana govt present new budget on march 11

telangana, budget, eetela, kcr, central, grants, funds, missionkakatiya, irrigation

telanagana govt present new budget on march 11. telanagana govt new budget may effected with central budget. the central govt didnot announce special fund and grants to telangana, so new budget may low than past year.

మార్చి 11న తెలంగాణ బడ్జెట్.. పది శాఖలకు అధిక నిధులు!

Posted: 03/04/2015 09:11 AM IST
Telanagana govt present new budget on march 11

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్  ఈ నెల 11వ తేదీన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ప్రభుత్వ పథకాలు మినహా కొత్త పథకాలను ప్రకటించరాదని సర్కారు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్రం నుండి ఆశించిన రీతిలో నిధులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు కావున తెలంగాణ బడ్జెట్ ఎంతో జాగ్రత్తగా రూపకల్పన చేస్తున్నారు అధికారులు. దీంతో ప్రస్తుత పథకాలలో ఏ పథకానికి అధిక కేటాయింపులుంటాయనే అంశాలపై ప్రభుత్వవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయిపులుంటాయని మాత్రం ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

 ప్రభుత్వోద్యోగుల పీఆర్సీ అమలుకు వీలుగా ప్రభుత్వంపై రూ.6,500 కోట్ల అదనపు భారం తప్పనిసరి కానుంది. దీంతో ప్రణాళికేతర వ్యయం దాదాపుగా రూ.65వేల కోట్లకు, ప్రణాళిక వ్యయం రూ.45వేల కోట్ల మేరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నవంబర్‌లో తొలిసారిగా రూ.1లక్ష 637 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిన సర్కార్ ఈ సారి ఎన్ని కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడుతుందో ఆసక్తి రేపుతోంది. దాదాపు కొత్త బడ్జెట్ రూ.1లక్ష 10వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా దాదాపుగా పూర్తయింది. కొత్త బడ్జెట్‌లో పది ప్రాధాన్యత అంశాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం లభించనుంది. అందులో సాగునీటి పారుదల, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, రహదారులు, హరితహారం, విద్యుత్‌రంగం, భూ పంపిణీ, అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం కింద గుడ్ల పంపిణీ, సన్నబియ్యం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి వాటికి అధికంగా నిధులు కేటాయించే అంశాలున్నట్లు తెలుస్తొంది.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  budget  eetela  kcr  central  grants  funds  missionkakatiya  irrigation  

Other Articles