Apsrtc record major loss in its history

apsrtc, telanagana, andhrapradesh, rtc, loss, roadtransportcorp

apstrc got record level loss in the history. for 2013-14 year apstrc got 931cr loss. ap and telanagana need to prevent the loss of apsrtc. ap 573cr, telanagana 358cr loss gained.

ప్ర'గతి' లేని ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆర్టీసీ నష్టాలు

Posted: 03/04/2015 08:48 AM IST
Apsrtc record major loss in its history

ఎపియస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ, ఎప్పుడూ నష్టాల కడలిలో కొట్టుకుంటూ ఉండే పెద్ద సంస్థ. 75 సంవత్సరాల చరిత్రలొ ఆర్టీసీ తొలిసారిగా ఎన్నడూ లేని కొత్త రికార్డును సాధించింది. రికార్డ్ అంటే కొంపదీసి లాభాలు అనుకునేరు..నష్టాలే..అవి కూడా భారీ నష్టాలు. 2013-14 సంవత్సరానికిగాను 902 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది ఆర్టీసి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ఫిబ్రవరి నెల వరకూ రూపొందించిన ఆదాయ-వ్యయాల పట్టికను రూపొందించారు. దానిని పరిశీలించి ఈ పదకొండు నెలల్లోనే ఆర్టీసీ 931.77 కోట్ల నష్టపోయింది. ఈ లెక్కన ఈసారి నష్టాలు  1,100 కోట్లను చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల్లో సింహభాగం ఆంధ్ర ప్రదేశ్ నుంచే వచ్చింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రం నుంచి  573.56 కోట్లు, తెలంగాణ పరిధిలో  358.21 కోట్లుగా నష్టం వచ్చినట్లుగా తేలింది.


ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల బాటలో నడుస్తున్నా, ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ప్రయత్నాలను చెయ్యలేదు. నష్టాలను తగ్గించేందకు ఎలాంటి నివారణ చర్యలను తీసుకోలేదు. ప్రతిసారి ఓ కమిటిని వెయ్యడం, నివేదిక తీసుకోవడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు విభజన అనంతరం ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీలో సంస్కరణల జోలికి వెళ్లకపోవడంతో నష్టాలు భారీగా పెరిగాయి. ఇరు ప్రభుత్వాలు కూడా కేవలం మొక్కుబడిగా అధికారులను వివరాలు అడగడం తప్ప సమీక్షలు నిర్వహించడం లేదు. దీంతో ఆర్టీసీ నష్టాలు పెరుగుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటున్నప్పటికీ నష్టాలు రావడానికి కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. విభజన నేపథ్యంలో అంతర్గతంగా అధికారుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలతో వారెవరూ పరిస్థితిని పట్టించుకోవటానికి ముందుకు రావటం లేదు. ఆర్టీసీ విభజనకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నందున.. దిద్దుబాటు చర్యలకు అవకాశం కనిపించడం లేదు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apsrtc  telanagana  andhrapradesh  rtc  loss  roadtransportcorp  

Other Articles