Bengaluru techie describes real self in matrimonial advert

Bengaluru Techie describes 'real self', axe of marriage looms over in India, Bengaluru based software engineer Indhuja Pillai, Bengaluru software engineer Indhuja, indhuja Pillai website, marry.indhuja.com, indhuja website marry.indhuja.com, visitors flowed into indhuja website, Indhuja Pillai marriage matters, indhuja takes marriage in her own hands,

The axe of marriage invariably looms over the heads of twenty-somethings in India, but a Bengaluru based software engineer Indhuja Pillai decided to take matters in her own hands.

బెంగుళూరు టెక్కీ ఇందూజ సాహసోపేత నిర్ణయం...

Posted: 03/03/2015 09:31 PM IST
Bengaluru techie describes real self in matrimonial advert

అనాధిగా వస్తున్న సాంఘీక సంప్రదాయాలకు భిన్నంగా ఓ యువతి నడుం చుట్టింది. అందివచ్చిన సాంకేతికతో తానేంటో తనకు తాను నిరూపించుకోగలిగింది. భారత దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతావనిలో మహిళలపై పెద్దలు పెట్టిన ఆంక్షలను తొలగించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అమె హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరామె..? ఏమా కథ అనుకుంటున్నారా.? అమె బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇందూజ. అమె యుద్దం ప్రకటించిన పెద్దల ఆంక్షాలు ఏమిటో తెలుసా..?

తమిళనాడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇందుజా పిళ్లై  (23)  ఉద్యోగ రిత్యా ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది. తల్లిదండ్రులు ఇందుజాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే దక్షిణాదికి చెందిన అందరు అమ్మాయిల్లకు భిన్నంగా ఆలోచించి అమె ఇప్పుడు హిట్ అయ్యింది. తాను అప్పుడే పెళ్లికి సిద్దంగా లేనని తన తల్లిదండ్రులతో పాటు యావత్ ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా అమె ఒక వెబ్ సైట్ ను రూపొందించింది. అదే marry.indhuja.com

తన వయసు 23 ఏళ్లు. నేను ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేను. ప్రస్తుతం ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుంటున్నానని పేర్కోంది. తన జీవితానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా.. తనకు మరింత సమయం కావాలని తెలిపింది. అంతేకాదు, భారత్లో 30 ఏళ్ల లోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలని ఆలోచనను, అమ్మాయిలపై ఆంక్షలను వదిలేయాలని పేర్కోంది. కాగా తన వెబ్సైట్ ప్రారంభించిన విషయం తెలిసి మొదట అమె అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారని తరువాత మెల్లమెల్లగా వారికి విషయం అర్థం అయిందని తెలిపింది.

తాను చెప్పిన అంశాలలో నిజం ఉందని వారు గ్రహించారు. తన ఆలోచనలపై ఎన్నో విమర్శలు, భిన్నాభిప్రాయాలు వస్తాయని, కొద్ది మంది మాత్రమే బ్లాగ్ చూస్తారని తొలుత ఇందుజా పిళ్లై భావించింది. అయితే ఆ వెబ్సైట్కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆనందంతో పాటు ఆమె ఆశ్చర్యానికి లోనవుతుంది. తన వెబ్సైట్ ను 2 లక్షల మంది వీక్షించడంతో పాటు 11 వేల లైక్లు వచ్చాయి. అయితే అధికంగా ఉత్తర భారతావని నుంచి స్పందనలు రాగా, దక్షిణాది నుంచి చాలా తక్కువ సంఖ్యలోనే వచ్చాయి. ఇదంతా చూసిన ఇందూజ తల్లిదండ్రలు ఇందుజా పెళ్లిపై ఇంతమంది స్పందిస్తారా..? అనుకుంటూ అమె పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indhuja Pillai  2 lakh visitors  Website  

Other Articles