Los angles police chief backs his men

Los Angles police chief backs his men, Los Angles police chief Charlie Beck, Los Angles Skid Row death, police have training on mentally ill, homeless man shot to death, row oveer Los Angles police fired in Skid, Los Angles police Officers Skid Row death,

Los Angles police chief Charlie Beck backs his men, says Officers who fired in Skid Row death have extensive training on mentally ill

ITEMVIDEOS: విమర్శలోచ్చినా.. అమెరికా పోలీసుల తీరు మారదా..?

Posted: 03/03/2015 09:24 PM IST
Los angles police chief backs his men

అగ్రరాజ్యం పోలీసులు వారి వ్యవహర శైలిపై అనేక విమర్శలను ఎదుర్కోంటున్నా పద్దతిని మాత్రం మార్చుకోవడం లేదు. చిన్న చోరి కేసులో తాను నేరస్థుడిని కాదు అని వాదించేందుకు ప్రయత్నించిన ఓ అబాగ్యుడి ప్రాణాన్ని పట్టపగలు అందరూ చూస్తుండగానే నట్టనడిరోడ్డపై హరించారు. పోలీసుల దురంహాకారానికి పరాకాష్టగా నిలిచే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాల్సిన పోలీసు యంత్రాంగం వారిని వెనకేసుకుని రావడం మరింత దౌర్భగ్యం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ వీడియో క్లిప్పింగ్‌లు హల్ చల్ చేస్తున్నాయి.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సమీపంలోని స్కిడ్ రోలో పేదలు నివసిస్తున్న ప్రాంతంలో ఒక వ్యక్తి మీద దొంగతనం కేసు నమోదయింది. పోలీసులు ఆదివారం అతనిని విచారించేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, పోలీసుల మద్య వాగ్వాదం జరిగింది. దీంతో కనీసం మచ్చకైనా మానవత్తం లేని నిరంకుశ పోలీసులు అత్యంత ఘోరానికి పాల్పడ్డారు. నిజానిజాలను వెలికితీయాల్సింది పోయి నడిరోడ్డుపై నిందితుడిని తుపాకీ తూటాలతో బలిగోన్నారు.

కాగా, తమ పోలీసు అధికారుల తుపాకీలను లాక్కునేందుక యత్నించడంతోనే వారు సదరు నిందితుడిని మట్టుబెట్టారని లాస్ ఏంజెల్స్ పోలీసు ఉన్నతాధికారి చార్లీ బెక్ వారిని వెనుకేసుకువచ్చారు. అంతేకాదు సదరు అబాగ్యుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా ఆయన తిరగబడ్డారని చెప్పారు. తమ అధికారులు మానసిక స్థితి సరిగా లేని వారిని దర్యాప్తు చేయడంలో కూడా సుశిక్షితులను ఆయన కితాబిచ్చారు. జరిగిన ఘటనపై భాద్యులైన అధికారును శిక్షించాల్సింది పోయి.. వారిని వెనకేసుకు  రావడంపై మానవ హక్కుల సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : criminal  america  police  public  

Other Articles