3 800 unification church couples wed in mass ceremony

3,800 couples wed in mass marriage, 3,800 Unification Church couples, South Korean headquarters of the Unification Church., miyong moon father of the church, south korea, unification church, messaiah death anniversary, Church couples wed in mass ceremony

Thousands of couples took part in a mass wedding today at the South Korean headquarters of the Unification Church.

ఇలా కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారా..!

Posted: 03/03/2015 09:22 PM IST
3 800 unification church couples wed in mass ceremony

దకిణ కోరియాలో తమకు ఆరాద్యుడైన గురువు జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు అక్కడి ప్రజలు చేసిన ప్రయోగం వార్తపత్రికల శీఖర వార్తలలో స్థానం సంపాదించింది. తమ ఆరాద్య గురువు కోసం వారు చేసిన విన్నూత ప్రమాణాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3800 మంది జంటలు అక్కడ గుమ్మిగూడి తమ గురువుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంతకీ వారు చేసిందేమిటీ, శీఖర వార్తలలో వారు ఎలా స్థానం సంపాదించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..?

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియాలోని  గ్యాపియాంగ్లో ఓ చర్చి ప్రాంగణం మొత్తం వధువరులతో నిండిపోయింది. అయితే వారందరూ అప్పటికే పెళ్లి చేసుకున్నవారే. కానీ మళ్లీ ఇలా పెళ్లినాటి దుస్తులతో తళక్కుమని మెరిసారు. తెలుపునలుపు వర్ణాలతో తళుక్కుమన్నారు. మరోసారి ఒకరికొకరు చేతిలో చేయివేసుకొని వాగ్దానం చేసుకుంటూ నాకు నువ్వు నీకు నేను అనంటూ ప్రమాణాలు చేసుకున్నారు.  అంతకుముందే జరిగిన తమ వివాహ వేడుకలను మరోసారి గుర్తుచేసుకున్నారు.

దక్షిణ కొరియాలోని గ్యాపియాంగ్లో సన్ మియంగ్ మూన్ అనే ఫాధర్ 1954లో యూనిఫికేషన్ చర్చిని నిర్మించారు. మియంగ్ మూన్ 2012లో నిమోనియాతో మరణించారు. ఆయనను మెస్సయ్యగా భావించే స్థానిక క్రైస్తవులు ఆయన చనిపోయి మూడో సంవత్సరం సందర్భంగాఇలా పెళ్లినాటి దుస్తులలో మెరసి తమ అభిమానం తెలుపుకునేందుకు ఆ చర్చి వద్దకు భారిగా తరలి వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఇక్కడకు చేరుకున్న జంటలు అన్ని ఈ చర్చిలోనే ఒక్కటయ్యాయి. దీంతో మూడవ సంవత్సరం సందర్భంగా అక్కడకు చేరుకున్న వారు తమ గురువు పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అందులో యువజంటలే ధికంగా ఉన్నాయి. మియాంగ్ భార్య హక్ జాహాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south korea  unification church  

Other Articles