Maharashtra bans beef

beef, maharastra, fadnavis, pranabmukharjee, fine, shivasena, bjp, devendrafadnavis

Beef lovers in Maharashtra will now have to do without the red meat as President Pranab Mukherjee has given his assent to the Maharashtra Animal Preservation (Amendment) Bill, 1995, nearly 19 years after the Maharashtra Assembly passed the Bill during the BJP-Shiv Sena rule in 1995.

మహారాష్ట్రలో గోమాంసం నిషేదం

Posted: 03/03/2015 05:00 PM IST
Maharashtra bans beef

మహారాష్ట్రలో గోమాంసాన్ని నిషేదిస్తు అక్కడి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. బిజెపి-శివసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ఇలా గోమాంసాన్ని నిషేదించడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా గోమాంసాన్ని అమ్మితే ఐదు సంవత్సరాల జైలు శిక్ష, పది వేల జరిమానా విధించాలని తాజాగా చట్టం వెలువడింది. మహారాష్ట్ర అనిమల్ ప్రిసర్వేషన్ బిల్ 1995, ను దాదాపు 19 సంవత్సరాల తర్వాత చట్టంగా ఆమోదాన్ని తెలిపింది. తాజా చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వాగతించారు. రాష్ట్రపతికి ఆయన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ఇది చరిత్రలో నిలిచిపోయే చట్టం అని, 1995లో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన బిల్ కు ఇప్పుడు చట్టం రూపం రావడం సంతోషంగా ఉందని ఫడ్నిస్ తెలిపారు. మొత్తానికి మహారాష్ట్రలో ఎక్కువగా అమ్ముడు పోయే గోమాంసాన్ని ఒక్క సారిగా నిషేదిస్తు, వెలువడ్డ చట్టంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తానికి హర్యానా రాష్ట్రం తరువాత గోమాంసాన్ని నిషేదించాలని అనుకున్నా, మహారాష్ట్ర ఇన్నాళ్లకు చట్టాన్ని తీసుకురావడం విశేషం. అయితే జంతువులను రక్షించాలన్న ఉద్దేశంతో ఇలాంటి చట్టాలను తీసుకురావాల్సి వచ్చిందని మహారాష్ట్ర నేతలు చెబుతున్నారు. కాగా మాంస ప్రియులు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beef  maharastra  fadnavis  pranabmukharjee  

Other Articles