They shouldnt talk about producing babies by akbaruddin

Akbaruddin Owaisi, sakshimaharaj, aimim, asaduddin owaisi, rss, hinduthva, minority

Those who are not married should not talk about producing babies or give advice to women. What do they know of family responsibilities? First get married and then give your advice,’’ Owaisi said while speaking at a function to mark the 57th formation day of All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) at the party headquarters Dar-us-salaam.

పిల్లలు కనడం గురించి మీకెందుకు..? అక్బరుద్దీన్

Posted: 03/03/2015 10:52 AM IST
They shouldnt talk about producing babies by akbaruddin

దేశంలో ఓ గంట మాకు స్వేఛ్చనిస్తే ఒక్క హిందువును కూడా లేకుండా చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ తాజా గా ఆర్ఎస్ఎస్ పై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కొందరు బీజెపీ నాయకులు గత కొంత కాలంగా మతపరమైన వ్యాఖ్యలు చెయ్యడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది. ఎంఐఎం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి చేసుకోని వారు పిల్లలు కనడం గురించి, వారిని పెంచడం గురించి ఏం తెలుసు అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ పెళ్లిళ్లు చేసుకోని వారి గుంపుఅని, పరోక్ష్యంగా సన్యాసుల సమూహం అన్నారు. హిందూ స్ర్తీలు నలుగురు పిల్లలను కనాలని కొన్ని రోజుల క్రితం సాక్షిమహారాజ్ చేసిన మాటలను పరోక్షంగా తప్పుపట్టారు. ముందు పెళ్లి చేసుకోవాలని, అప్పుడు కానీ అనుబంధాల గురించి తెలియవని ఆయన అన్నారు.  దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని మతాలను టార్గెట్ గా చేస్తు వ్యాఖ్యలు చేస్తున్నారని, మన ఐక్యత వారిని అడ్డుకుంటుందని అన్నారు. ముస్లింలు ఐక్యంగా లేకపోతే, రానున్న కాలంలో ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అక్బరుద్దీన్ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లోపు ఎంఐఎం పార్టీని కర్నాటక, పశ్చిమబెంగాల్, బిహార్ లకు విస్తరిస్తామని ప్రకటించారు. ముస్లింల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని తెలిపారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akbaruddin Owaisi  sakshimaharaj  aimim  asaduddin owaisi  rss  hinduthva  minority  

Other Articles