Ys jagan mohan reddy pawan kalyan ap political issues

pawan kalyan news, ys jagan mohan reddy, ap politics news, chandrababu naidu news, ap farmers news

ys jagan mohan reddy pawan kalyan ap political issues : Pawan kalyan is going very fast in ap politics while ys jagan mohan in silent mode.

జగను పాయే పవను వచ్చే ఢాం.. ఢాం.. ఢాం..?

Posted: 03/02/2015 09:30 PM IST
Ys jagan mohan reddy pawan kalyan ap political issues

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వెరైటీగా వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాలో వున్న జగన్.. గతకొన్నాళ్ల నుంచి మౌనం పాటిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టుగా ఆంధ్రాకు ఏమాత్రం నిధులు లభించకపోగా.. దానిపై జగన్ ఒక్కమాట ఇంతవరకు లేవనెత్తలేదు. ఎప్పుడూ చూసిన బాబుపై విమర్శిస్తూ యాత్రలు కొనసాగిస్తున్నారు గానీ.. బడ్జెట్టుపై మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా జగన్ వైఖరితో కాస్త ఆగ్రహంతో వున్నారని అంటున్నారు.

మరోవైపు.. తన జనసేన పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కాదు కదా.. అసలు రాజకీయ అనుభవమే లేని పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో పవర్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇంతవరకు సైలెంట్ గా వున్న పవన్.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాధికారాల మీద ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఇటీవలే తన ట్విటర్ లో ‘ఏపీకి న్యాయం చేసే సమయం బీజేపీకి ఇప్పుడు టైమొచ్చింది’ అంటూ ట్వీట్ చేయడంతోపాటు ‘ఆంధ్రారైతులకు తగిన విధంగా నిర్ణయం తీసుకుని బాధ్యత ఏపీ ప్రభుత్వానికి వుంది’ అంటూ పేర్కొన్నారు. ఇక అప్పటినుంచి ఈయన రాజకీయాల దూకుడు పెరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాలపై పవన్ ప్రశ్నించాలంటూ రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. తానిచ్చిన మాటప్రకారం పవన్ ఇలా రాజకీయ పావులు కదిపారు.

ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. సైలెంటుగా వున్న జగన్ పవన్ మౌనాన్ని ప్రశ్నించినట్లుగా వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ హవా కంటే ఇప్పుడు పవన్ గాలియే ఎక్కువ వీస్తున్న పరిస్థితులను చూస్తుంటే.. జగన్ ఫాలోయింగ్ తగ్గే సూచనలు వున్నాయని అంటున్నారు. మొత్తానికి పవర్ పంచ్ ప్రభావం జగన్ పై అప్పుడే పడిందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan news  ap farmers  ys jagan news  chandrababu naidu  

Other Articles