Sachin tendulkar rahul gandhi parliament attendance actress rekha controversy

rahul gandhi news, sachin tendulkar news, actress rekha news, parliament mps, parliament of india, loksabha news, rahul gandhi sachin news, rahul gandhi controversies, sachin tendulkar controversy, rekha controversy, rahul gandhi holiday trip

sachin tendulkar rahul gandhi parliament attendance actress rekha controversy : Rahul gandhi is more better than sachin tendulkar in the parliament attendance.

సచిన్ పరమ వేస్ట్.. రాహుల్ గాంధీ చాలా బెస్ట్!

Posted: 03/02/2015 08:02 PM IST
Sachin tendulkar rahul gandhi parliament attendance actress rekha controversy

క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డుల మోత మోగించి, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే చాలా దారుణమైన స్థితిలో వున్నారని తెలిసింది. అసలు ఒక క్రికెటర్ కి, పొలిటికల్ లీడర్ కి లింకేంటి..? అని అనుకుంటున్నారా..? ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే.. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే! బడ్జెట్ సమావేశాలు జరగడానికి రెండురోజుల ముందే రాహుల్ హాలిడే ట్రిప్ కి వెళ్లిపోయారు. ఆయన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా అదొక సంచలనంగా మారింది. అత్యవసరమైన బడ్జెట్ సెషన్ సమయంలో రాహుల్ హాలిడేకి వెళ్లడమేంటని ప్రశ్నల మీద ప్రశ్నలను లేవనెత్తేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటికీ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతూనే వున్నాయి. రాహుల్ పై కుళ్లుజోకులు, సెటైర్లు, కామెడీ బొమ్మలు వంటివి ఎన్నో దర్శనమిస్తున్నాయి.

ఇప్పటికే దారుణమైన పరిస్థితిలో వున్న కాంగ్రెస్ కి ఇప్పుడు రాహుల్ ట్రిప్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో జరుగుతున్న డ్యామేజీని కొంతవరకైనా తగ్గించుకునే పనిలో పడింది కాంగ్రెస్! అదేమిటంటే.. పార్లమెంటులో వున్న ఎంపీలందరూ ఇప్పటివరకు ఎంత శాతం హాజరయ్యారనే విషయాన్ని లేవనెత్తి, తమ నాయకుడ్ని కాపాడుకునే పనిలో పడింది. రాహుల్ గాంధీ కంటే ఇతర ఎంపీలు మరింత దారుణంగా హాజరయ్యారంటూ కాంగ్రెస్ లెక్కలు తేల్చి చెబుతోంది. ఈ హాజరు లెక్కల్లో చాలా దారుణంగా వున్న ఎంపీలు చాలామందే వున్నారు. అందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరు శాతం అయితే అత్యంత ఘోరంగా వుందని తేలింది.

పార్లమెంటులో రాహుల్ గాంధీ హాజరు ఇప్పటివరకు 65 శాతం వుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే.. ఆయనకంటే 120 మంది ఎంపీల హాజరు మాత్రం అత్యంత దారుణంగా వుందని పార్టీ వెల్లడించింది. లోక్ సభలో శిబుసోరెన్, దీపక్ అధికారి, పన్వర్ లాల ల హాజరు 5 శాతం కంటే తక్కువగా వుందని తెలిపింది. అలాగే రాజ్యసభకు 5 శాతం కంటే తక్కువగా హాజరైన వారిలో సచిన్, సినీ నటి రేఖలు వున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంటే రాహుల్ హాజరు 65 శాతం కాగా, సచిన్ హాజరు 5 శాతం కంటే తక్కువగా వుంది. ఈ విషయంలో సచిన్ కంటే రాహుల్ గాంధీయే బెటర్ అనిపించుకున్నాడన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sachin tendulkar  actress rekha  parliament of india  

Other Articles