Aap party getting troubles

aap, aamadmiparty, kejriwal, prashanth bhushan, yogendrayadav

As the Aam Aadmi Party gets embroiled in a fresh, and by far its most serious, bout of factional tussle, the chances of it imploding from internal dissension gets bigger. The party may yet manage to find peace but the flurry of allegations and counter allegations involving Yogendra Yadav, the party’s ideologue and only popular intellectual face, and Prashant Bhushan, the party’s conscience keeper, in public space may leave a lasting impact on the two-year old outfit

ఆప్ లో ముదిరిన వివాదం..

Posted: 03/02/2015 05:04 PM IST
Aap party getting troubles

ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. సీనియర్లు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు పార్టీ ని వీడే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేజ్రీవాల్ వైఖరి పట్ల కూడా సీనియర్లలో అసంతృప్తి  కలగడంతో పార్టీలో చీలికలు అనివార్యంగా కనిపిస్తోంది. సీనియర్ల సమస్యను పరిష్కరించేందుకు ...ఆప్ పార్టీ ఈనెల 4న జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది. పార్టీలో  పెరుగుతున్న  తిరుగుబాటుపై సీరియస్ గా ఉన్న కేజ్రీవాల్ ..సీనియర్లను పార్టీ నుంచి పంపించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లకు, పార్టీ సభ్యుల మధ్య పార్టీ కార్యవర్గం అంశంపై భేదాభిప్రాయాలు వచ్చాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఢిల్లీ కార్యదర్శి దిలీప్ యాదవ్ ..పార్టీ చీఫ్ కు లేఖ రాశారు. దీంతో ఆప్ లుకలుకలు బటయపడ్డాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన యోగేంద్ర యాదవ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నిర్ణయాలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా పార్టీలో కొనసాగుతున్న ముసలం మీద మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. పార్టీలో మంచి జరిగినా..చెడు జరిగినా...అందరికీ తెలుస్తోందన్నారు.  ఏదేమైనా యోగేంద్ర యాదవ్ మాత్రం ..పీఏసీకి గుబ్ బై చెప్పాలనుకుంటున్నారని, పార్టీ కార్యవర్గం నుంచి తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు తనపై వస్తున్న వార్తలను ప్రశాంత్ భూషన్ ఖండించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందించడం సరైంది కాదన్నారు. పార్టీలో ఏర్పడ్డ ముసలం..కొత్త ప్రభుత్వంపై పడుతుందన్న ఆందోళనలో ఆప్ ఉందని బీజేపీ నేత విజయ్ గోయల్ అన్నారు. మొత్తం మీద ఆప్ నేతల లేఖలు పార్టీ అంతర్గత కలహాలను బయటపెట్టాయి. కాగా కేజ్రీవాల్ పార్టీ కన్వీనర్ పదవి నుండి తప్పుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  aamadmiparty  kejriwal  prashanth bhushan  yogendrayadav  

Other Articles