Kcr announce that his govt for the telanagana people

kcr, telanagana, telangana govt, pention, mission kakatiya

kcr announce that his govt for the telanagana people. telanaga cm kcr clear that who didnt get pention, they no need to worry. the telanagan govt will provide pention for all eligibility candidates.

తల తెగినా అనుకున్నది సాధిస్తా.. తెలంగాణ సిఎం కెసిఆర్

Posted: 03/02/2015 04:36 PM IST
Kcr announce that his govt for the telanagana people

తెలంగాణ రాక ముందు నేను ఢిల్లీకి వెళ్లేటప్పుడు తెలంగాణలోనే అడుగుపెడుతానని చెప్పా. చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టా అని తెలంగాణ సిఎం కెసిఆర్ తెలిపారు. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.. తల తెగినా అనుకున్నది సాధిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకిత భావంతో ఉందన్నారు. పెన్షన విషయంలో తీవ్రంగా ఆలోచించి ఆలనా పాలనా లేనివాళ్ల కోసమే రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నామని కెసిఆర్ తెలిపారు. పెన్షన్లు రానివారు అధైర్య పడకుండా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హునికి పెన్షన్లు ఇస్తామని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చేవారు.. ఇప్పుడు కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు. బీడీ కార్మికుల సమస్యలు తనకు తెలుసు.. వారి ఇళ్లలో ఉండి తాను చదువుకున్నానని తెలిపారు. చెరుకు రైతుల బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు.  పెన్షన్లు రాని వారికి సర్పంచ్‌లు సహకరించి వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు.

మిషన్ కాకతీయ పేరిటి చెరువుల పూడికలు తీసి పూర్వ వైభవం తెస్తామని వెల్లడించారు. మీ ఊరి చెరువు నిండితే.. మీ ఊరి కడుపు నిండినట్టే అని తెలిపారు. 2017 నాటికి తెలంగాణ రైతాంగానికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అందిస్తామన్నారు. 2018 నాటికి రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవు అని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శంగా ఉంది 2.3 వేల మెగావాట్ల విద్యుత్‌ను అవసరమైతే పక్క రాష్ర్టాలకు అందిస్తామని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా 2019 లోపు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతీ చోట పరిశుభ్రమైన మంచినీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సి ఉంది.. పార్టీలకతీతంగా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రకటించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telanagana  telangana govt  pention  mission kakatiya  

Other Articles