Venkiaih naidu disappoint on media questions

venkaiah naidu, media, ap, special status, budget

venkiaih naidu disappoint on media questions. central urban minister, bjp parliamentary affairs minister m.venkaiahnaidu disppoint on media. some media persons questions venkayya on ap special status and special allavence.

అవును నేను అసమర్థుడినే: వెంకయ్య నాయుడు

Posted: 03/02/2015 02:57 PM IST
Venkiaih naidu disappoint on media questions

తన మాటల తూటాలతో విపక్షాలకు చెమటలు పట్టించగల మాంత్రికుడు వెంకయ్య నాయుడు. కానీ అంతటి నేత తాను అసమర్తుడినే అంటూ వ్యాఖ్యనించారు. ఏపికి నిధులను తీసుకురావడంతో విఫలమయ్యారని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు వెంకయ్య నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఔను.. మీకున్నంత నాలెడ్జి నాకు లేదు. మీ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నాను. అసమర్థుడినే అని ఆయన అన్నారు. పిండి కొద్దీ రొట్టె. కాంగ్రెస్‌ వాళ్లు దేశాన్ని గుల్ల చేసి వెళ్లారు. ఉన్న నిధులను అన్ని రాష్ట్రాలకూ కేటాయించాం అన్నారు. అయినా, 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రానున్న ఐదేళ్లలో ఏపీకి రూ.2,06,819 కోట్లు రానున్నాయి వెల్లడించారు. 13వ ఆర్థిక సంఘం సిఫార్సులతో పోలిస్తే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ అని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని రాజ్యసభలో అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసి, అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పిన మీరు.. పదవి వచ్చిన తర్వాత రాజీ పడినట్లు కనిపిస్తున్నారని విలేకరులు వ్యాఖ్యానించగా, వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మీకున్న అవగాహన, ఆలోచనాశక్తి నాకు లేవు. పదవి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అని తెలిపారు. నేను ఏమి చేస్తున్నానో మీకు తెలియదు. ప్రతి రోజూ కొంత సమయం ఏపీ కోసం కేటాయిస్తున్నానని,  పోలవరానికి కేటాయింపులు పెంచేలా అరుణ్‌ జైట్లీతో మాట్లాడుతున్నానని వెంకయ్య చెప్పారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  media  ap  special status  budget  

Other Articles