Tdp party will not have even one seat in legislative council

ttdp, mlc narsareddy, mlc, legislative assembly, kcr, chandrababunaidu, tdp party, ntr, ysrajashekarreddy

tdp party will not have even one seat in legislative council. tdp will lose its one and only member in telanagana legislative council on this month end. ttdp mlc narsareddy will end his peroid on march 31.

టి.శాసన మండలిలో టిడిపి గల్లంతు.. చరిత్రలో తొలిసారి

Posted: 03/02/2015 09:13 AM IST
Tdp party will not have even one seat in legislative council

శాసన మండలి చరిత్రలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అదృశ్యం అవుతోంది. ఇప్పుడు తెలంగాణ శాసన మండలిలో టిడిపి సభ్యులు ఒక్కరూ ఉండని పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో టిడిపి సభ్యుడు ఒకే ఒక్కరు. టిడిపి సభ్యునిగా ఉన్న అరికెల నర్సారెడ్డి పదవీ కాలం ఈనెల 31తో ముగుస్తుంది. ఏప్రిల్ ఒకటి నుంచి టిడిపి తరఫున మండలిలో ప్రాతినిధ్యం వహించే వారే ఉండరు. తెలుగుదేశం నుంచి మండలిలో ప్రాతినిధ్యం వహించేవారు నలుగురు ఉంటే వారిలో ముగ్గురు టిఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలిన ఏకైక సభ్యుడు నర్సారెడ్డి పదవీ కాలం 31తో ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సభ్యులు వస్తారు. వీరిని శాసన సభ్యులు ఎన్నుకొంటారు. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా మండలిలో కొత్తగా టిఆర్‌ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు, గవర్నర్ నామినెటెడ్ సభ్యుడు ఒకరు మొత్తం అధికార పక్షం తరఫున ఎనిమిది మంది వస్తారు. 17మంది ఓట్లకు ఒక ఎమ్మెల్సీ ఎన్నికవుతారు. టిడిపి తరఫున అసెంబ్లీకి గెలిచిందే 15 మంది. ఒకవేళ ఈ పదిహేను మంది ఎమ్మెల్యేలు అలానే టిడిపిలో ఉన్నా వారి సంఖ్య ద్వారా ఎమ్మెల్సీ సీటు దక్కదు. గెలిచిన 15 మందిలో ముగ్గురు ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో చేరారు. మరో ముగ్గురు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శాసన మండలి సభ్యుల ఎన్నికకు ముందే వాళ్లు టిఆర్‌ఎస్‌లోకి రానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. రెండు గ్రాడ్యుయేట్ నియోజక వర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో టిడిపి పోటీనే చేయలేదు. టిఆర్‌ఎస్ బిజెపిల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. దీంతో గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి కూడా శాసన మండలిలోకి ప్రవేశించే అవకాశం లేదు.


ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాసన మండలిని రద్దు చేశారు. 2004లో టిడిపి ఓడిపోయి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మండలిని పునరుద్ధరించారు. టిడిపి తిరిగి అధికారంలోకి వస్తే మండలిని రద్దు చేస్తామని చంద్రబాబు తొలుత ప్రకటించినా, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసెత్తలేదు. బహుశా అప్పుడు గనక చంద్రబాబు శాసన మండలిని రద్దు చేసి ఉంటే, ఇప్పుడు టిడిపి ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా అని కొందరు టిడిపి సీనియర్లు అనుకుంటున్నారు. మొత్తానికి మొదటిసారిగా టిడిపి శాసనమండలిలో ఒక్క సభ్యుడిని కూడా కల్గి ఉండకపోవడం చరిత్రలో మిగులనుంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttdp  mlc narsareddy  mlc  legislative assembly  kcr  chandrababunaidu  tdp party  ntr  ysrajashekarreddy  

Other Articles