Tpcc post rise new alligation in congress

congress, telanagana congress, tpcc, ponnala, uttamkumar, geethareddy, bhattivikramarka, palvai, janareddy

tpcc post rise new alligation in congress. delhi congress leaders appointed uttamkumar as new telanagana pcc president. on this issue some ponnala followers, trying support ponnala. some bc leaders demand to bc priority in congress.

టిపిసిసి పదవిపై రాజుకున్న వివాదం

Posted: 03/02/2015 08:50 AM IST
Tpcc post rise new alligation in congress

టిపిసిసి అధ్యక్ష పదవిపై వివాదం మొదలైంది. పొన్నాల లక్ష్మయ్యను తప్పించి ఆ స్థానంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమించాలన్న ఎఐసిసి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొన్నాల అనుకూల, వ్యతిరేకవర్గాలు, ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. సిఎల్‌పి నాయకునిగా ఉన్న కె. జానారెడ్డి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఉత్తమ్‌ను టి.పిసిసి అధ్యక్షునిగా ఎలా నియమిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. పైగా ఇరువురూ ఒకే లోక్‌సభ నియోజకవర్గం పరిథిలోని ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతేకాకుండా ఉత్తమ్‌ను సొంత జిల్లాలోని ఆయన సామాజికవర్గానికి చెందిన కొంత మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు. జానారెడ్డితో పాటు ఎంపి కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు ఉత్తమ్‌ను వ్యతిరేకిస్తుండగా, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రం ఇంత అర్జంటుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు పొన్నాలను మొదటి నుంచి విమర్శిస్తున్న ఎంపి పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఉత్తమ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. సిఎల్‌పి నేతగా జానారెడ్డి ఉన్న తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్‌ను టి.పిసిసి అధ్యక్షునిగా ఎలా నియమిస్తారని, పైగా వెనుకబడిన కులానికి చెందిన పొన్నాలను అంత అర్జంటుగా తప్పించాల్సిన అవసరం ఏముందని పార్టీలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

సాధారణ ఎన్నికలకు వంద రోజుల ముందు పొన్నాలకు టి.పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించారని, దేశ వ్యాప్తంగా పార్టీ ఓటమి చెందినప్పుడు తెలంగాణలో మాత్రం అద్భుతాలు ఎలా సృష్టిస్తారని కొందరు అనుకుంటున్నారు. అధ్యక్షుడ్ని మార్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు పార్టీని అధికార పీఠంపైకి ఎక్కించలేరు కదా? అని పార్టీలో  చర్చ జరుగుతోంది. మరో వైపు కుల పోరు కూడా ఇందుకు తోడవుతోంది.  పొన్నాలను తప్పించినా, తిరిగి బిసికే ఆ పదవి ఇవ్వాలి తప్ప, ఉత్తమ్‌కు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయంపై కొందరు బిసివర్గం నేతలు మండిపడుతున్నారు. ఒకవేళ ఉత్తమ్‌కు టి.పిసిసి పగ్గాలు అప్పగిస్తే, సిఎల్‌పి నేత పదవిని ఎస్‌సిలైన జె. గీతారెడ్డి లేదా మల్లు భట్టివిక్రమార్కకు ఇవ్వాలని డిమాండ్ ప్రారంభమైంది. అలాకాని పక్షంలో మరో ఏడాది వరకు పొన్నాలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొన్నాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు, అనుకూలంగా ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు.మొత్తానికి పొన్నాల వ్యవహారం కొత్త చర్చకు దారి తీసింది. అధిష్టానం నుండి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  telanagana congress  tpcc  ponnala  uttamkumar  geethareddy  bhattivikramarka  palvai  janareddy  

Other Articles