Ntr would become pm if he is live says narayana murthy

NTR would become PM, NTR would become PM if he is live, says Narayana Murthy. tollywood director producer actor Narayana Murthy, Narayana Murthy comments on MGR, Narayana Murthy coimments on bharat ratna, Narayana Murthy on sr NTR, Narayana Murthy movies, Narayana Murthy collections, Narayana Murthy latest updates, Narayana Murthy latest news, Narayana Murthy upcomming movies, Narayana Murthy forth comming movies, Narayana Murthy hits,

NTR would become PM if he is live, says Narayana Murthy

ఎన్టీయార్ కు ఎందుకు భారతరత్న ఇవ్వరూ..?

Posted: 03/01/2015 08:52 PM IST
Ntr would become pm if he is live says narayana murthy

ఆంధ్రుల ఆరాధ్యుడు, ప్రముఖ సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్ నారాయణ మూర్తి తన గురుభక్తిని చాటుకున్నారు. ఎన్టీ రామారావు మరణించి ఉండకపోతే ప్రధానమంత్రి అయ్యేవారన్నారు.  ప్రసాద్ ఐమాక్స్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారికి భారతరత్న ఇచ్చి మనవాళ్లకు ఎందుకివ్వరని ప్రశ్నించారు.

ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణకు కూడా కేంద్రం అన్యాయం చేస్తూ వచ్చిందన్నారు. మంగళంపల్లికి కూడా కేంద్రం భారత రత్నను ప్రకటించాలన్నారు. మంగళంపల్లికి ఎందుకు భారతరత్న అవార్డును ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. లతా మంగేష్కర్ వంటి వారు అంటే గౌరవమని, కానీ మన సుశీలమ్మకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఈ వివక్ష ఎందుకని ప్రశ్నించారు. 'ఎంజీఆర్ కంటే ఎందులో ఎన్టీయార్ ఎందులో తక్కువని ఆయన నిలదీశారు. పద్మశ్రీ, భారతరత్న సహా అన్నింటా లాబియింగ్ బాధాకరమని ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంజీఆర్ కాలం తమిళనాడుకే పరిమితమని, ఎన్టీఆర్ మాత్రం దేశ నాయకుడన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదాలో దేశ రాజకీయాలనే శాసించిన ఎన్టీయార్ కు ఎందుకిత పరాభవమని నిలదీశారు. కాగా, స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోకపోయి ఉంటే ఆయన ప్రధాని అయ్యేవారని తెలుగు తమ్ముళ్లు కూడా భావిస్తారు. ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి నోట అవే వ్యాఖ్యలు రావడం గమనార్హం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  R Narayana Murthy  Bharat Ratna  

Other Articles