Seeking support from pawan kalyan says chandra babu

seeking support from pawan kalyan says chandra babu, pawan kalyan, chandrababu to meet modi soon, pawan kalyana meets chandrababu, pawan kalyana meets ap cm, pawan kalyana meets tdp president, cine hero, janasena party president pavan kalyan, andhra pradesh chief minister chandrababu naidu, pavan talks ap farmers issue with cm, pavan talks on centres help to state, cm distress on aid to ap,

cine hero, janasena party president pavan kalyan and andhra pradesh chief minister chandrababu naidu to meet prime minister modi soon

పవన్ కళ్యాన్.. ప్రత్యేక హోదాపై సహకరించరూ ప్లీజ్..

Posted: 03/01/2015 05:57 PM IST
Seeking support from pawan kalyan says chandra babu

రాజధాని నిర్మాణంలో సహకరించాలని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే.అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిందిగా పవన్ ను కోరానన్నారు.  భూసమీకరణ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఉదారంగానే అందించామన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు మరోసారి తెలిపారు.
 
పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. గత కొన్ని రోజుల క్రితం రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని భూములు విషయంలో  చంద్రబాబును పవన్ ప్రశ్నించాలని రైతులు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవలే కేంద్రం తన హామీలను నెరవేర్చుకునే సమయం వచ్చిందంటూ పవన్ ట్విట్టర్ లో పేర్కొనడం కూడా చర్చనీయాంశంగా మారింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chandra babu naidu  ap capital  union budget  

Other Articles