Center is persuing special status of ap says venkaiah naidu

center is persuing special status of ap, andhra pradesh special status, stata bifurfication bill, state reoganisation bill, andhra pradesh demand of special status, union finance minister arun jaitley, union minister venkaiah naidu, andhra pradesh chief minister chandrababu naidu,

union government is persuing andhra pradesh demand of special status says union minister venkaiah naidu

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కేంద్ర పరశీలనలో వుంది

Posted: 03/01/2015 04:19 PM IST
Center is persuing special status of ap says venkaiah naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పరిశీలనలో ఉందని, ఈ అంశంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. విభజన చట్టాన్ని గౌరవిద్దామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనతో చెప్పినట్లు వెంకయ్య పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వెంకయ్య.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకున్న మేర నిధులు రాలేదని ఆయన అంగీకరించారు. అయితే నవ్యాంధ్రకు అన్యాయం జరగలేదని, బడ్జెట్ తరువాత కూడా నవ్యాంధ్రకు మేలు చేసే విషయాలపై ఆర్థిక మంత్రితో చర్చించామని చెప్పారు. నిధుల కేటాయింపులు దేశ ఆర్థిక స్థితిన దృష్టిలో పెట్టుకుని జరిగాయన్నారు.
 
తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరగనవి.. 9 నెలల్లో జరగాలంటే విడ్డూరం కాక ఏమిటని ప్రశ్నించారు. సమాధానం చెప్పే నైతికత ఉంది కాబట్టే, ధైర్యంగా మాట్లాడుతున్నానన్నారు. తప్పించుకునే అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ రాజధాని తీరు తెన్నులు తెలిశాక వాటికి కేటాయింపులు ఉంటాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు కాగా కేంద్ర బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమాట్లాడానని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో విశాఖ, విజయవాడకు మెట్రో రైళ్లను పొందుపరిచారని తెలిపారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ సహా అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union government  special status  venkaiah naidu  

Other Articles