Telugu content

pawan kalyan, chandrababu to meet modi soon, pawan kalyana meets chandrababu, pawan kalyana meets ap cm, pawan kalyana meets tdp president, cine hero, janasena party president pavan kalyan, andhra pradesh chief minister chandrababu naidu, pavan talks ap farmers issue with cm, pavan talks on centres help to state, cm distress on aid to ap

cine hero, janasena party president pavan kalyan and andhra pradesh chief minister chandrababu naidu to meet prime minister modi soon

త్వరలో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు పవన్ కళ్యాన్

Posted: 03/01/2015 12:12 PM IST
Telugu content

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఇవాళ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా త్వరలో చంద్రబాబుతో పాటు పవన్ కల్యాన్ కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై వారు కేంద్రానికి మరోమారు విన్నవించే అవకాశాలున్నాయి.

పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగడంపై బాబు, పవన్ లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని తెలుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక హోదా అంశంపై బడ్జెట్ లో ప్రస్తావించకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో పవన్ ను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించిన చంద్రబాబు ఆయనతోనూ పలు విషయాలపై చర్చించారు. అటు ఇదే సందర్భంలో ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించిన వివరాలను కూడాపవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chandra babu naidu  ap capital  union budget  

Other Articles