No gain and no loss with the budget

jailtley, financestatement, budget, investment, service tax, cess, achedin, ndagovt

Jaitley promised higher investment in India's decrepit roads and railways, offered the carrot of corporate tax cuts to global corporations and the stick of tighter compliance rules to get Indian tycoons to invest at home rather than stash wealth abroad.

ప్రత్యేకం: "అచ్ఛే దిన్" రాలేదు.. ఎవరినీ సంతోషపెట్టని బడ్జెట్

Posted: 02/28/2015 05:01 PM IST
No gain and no loss with the budget

బడ్జెట్ ఎలా ఉంటుందో, స్టాక్ మార్కెట్ లో లాభాలు వస్తాయో రావో అని సగటు పెట్టుబడిదారుని భయం. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశపెడుతుందో, పన్ను మినహాయింపులను ఎంతకు పెంచుతుందో అని సగటు ఉద్యోగి భయం. కనీసం ఈ బడ్జెట్ తరువాతైనా ఇళ్లు కట్టుకుందామని మధ్య తరగతి ఆశ. ఇలా ఆశలు, భయాలతో బడ్జెట్ రానేవచ్చింది. గత ప్రభుత్వాల్లా గోరంత దాన్ని కొండంత చెయ్యలేదు, నేల విడిచి సాము చెయ్యలేదు నిజానికి వాస్తవానికి దగ్గరగా సాగింది బడ్జెట్.

అచ్చే దిన్ అచ్చే దిన్ అంటూ మోదీ ఎన్నికల సమయంలో అందరిని ఊరించారు. నిజంగానే మంచి రోజులు వచ్చాయని కొందరు అప్పుడే ఊహాలోకంలోనూ విహరించారు. కానీ పాపం వారి మాటలకు అర్థం వారికి తెలియదు, అచ్చే దిన్ అని వారి గురించి వారే అనుకున్నారు కాబోలు. బిజెపి పార్టీకి మంచి రోజులు వచ్చాయే కానీ సగటు భారతీయుడికి మాత్రం ఎప్పుడూ ఆ రోజు రానేలేదు. ఫిబ్రవరి 28 అంటే ప్రతి సంవత్సరం విశేషమే. భారతదేశంలో ప్రతి సంవత్సరం అమలు చేయబోయే బడ్జెట్ ను ఆ రోజే వెల్లడిస్తారు.

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కొట్ల మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు, ఇక స్టాక్ మార్కెట్ల వద్దైతే హడావిడి అంతాఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం 17.87 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అందరూ ఒక్క సారిగా గుండెలు చేతిలో పెట్టుకొని తమకు ఏదైనా స్వీట్ న్యూస్ వస్తుందా అని అందరు ఎదురుచూారు. కానీ బడ్జెట్ లో దాదాపుగా అందరికి నిరాశే ఎదురైంది. సగటు మధ్య తరగతి వ్యక్తులకైతే మరీ నిరుత్సాహాన్ని నింపిందీ బడ్జెట్. ఆదాయ పన్ను పరిధిని 2.5 లక్షల నుండి 4 లక్షలకు పెంచుతారని అనుకున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు జైట్లీ. అసలు ఆదాయపన్ను జోలికి పోకుండా, మిగిలిన పన్నులను పట్టించుకున్నారు. అయితే సర్వీస్ ట్యాక్స్ ను రెండు శాతం పెంచడం మామూలు జనంపై భారాన్ని మోపనుంది.

ముందు నుండి సామాన్య జనానికి మేలు చేస్తామని చెప్పిన ఎన్డీయే ప్రభుత్వం తన మాటలను చేతల్లో పెట్టలేదు. బడ్జెట్ లో అసలు మధ్యతరగతి వ్యక్తులకు ఒక్కటంటే ఒక్కటీ ఉపయోగకరంగా లేవని అనుకుంటున్నారు. అయితే సీనియర్‌ సిటిజన్లకు రూ.30వేలు మినహాయింపు, పింఛను నిధుల కోసం మినహాయింపు రూ.లక్ష నుంచి లక్షన్నరకు పెంపు,  ఉద్యోగులకు రవాణా అలవెన్స్‌ మినహాయింపు రూ.800 నుంచి రూ.1600కు పెంచడం లాంటివి కాస్త మేలనిపించాయి. అయితే తాము అనుకున్నది ఒకటైతే, ఇక్కడ బడ్జెట్ లో వచ్చినవి ఒకటి అని కొందరు పెదవి విరుస్తున్నారు. సామాన్య జనాలపై సర్వీస్ ట్యాక్స్ భారాన్ని మోపిన కేంద్రం, కార్పోరేషన్ పన్నును మాత్రం 30 శాతం నుండి 25 శాతానికి తగ్గించింది. కార్పేరేట్ సేవల పరిధిలోకి యోగాను కూడా చేర్చింది. అయితే కోటి రూపాయల ఆదాయం కలిగిన వారికి 2 శాతం అదనపు సెస్ ను విధించింది కేంద్రం. ఇలా అటు కార్పోరేట్ వర్గాలకు పూర్తి స్థాయిలో మేలు చెయ్యక, ఇటు మధ్య తరగతి వారికి మేలు చెయ్యకుండా అందరిని నిరాశ పరిచింది.

మరో పక్క స్టాక్ మార్కెట్ లో ర్యాలీ మరీ నిరాశాజనకంగా సాగింది. ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త సంస్కరణలు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని లాభాల బాట పట్టినా, అది ఎక్కవ సమయం ఉండలేదు. సర్వీస్ ట్యాక్స్ ను 14 శాతానికి పెంచుతూ అరుణ్ జైట్లీ ప్రసంగం సాగుతుండగా స్టాక్ మార్కెట్ వేగంగా కూలిపోయింది. అలా జైట్లీ ప్రసంగం ఆసాంతం స్టాక్ మార్కెట్ ఓ దశలో పరుగులు పెడుతూ, మరో దశలో డీలా పడిపోయింది. మోదీ మాయ చేస్తారనుకుంటే, మాయా లేదు మర్మం లేదని ఏం చెయ్యనే లేదు. బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు కార్పోరేట్ వర్గాల్లో ఆనందాన్ని పూయించింది.

మోదీ ప్రభుత్వ కలల ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ లాంటి పథకాలకు బడ్జెట్ ప్రాధాన్యతనిచ్చింది. వైద్య, ఆరోగ్య రంగాలకు ఎక్కువ నిధులను కేటాయిస్తు చేసిన నిర్ణయం మంచిదే. ఉపాధి హామీ పథకానికి మరో 5వేల కోట్ల రూపాయలను కేటాయించడం కూడా మంచి అంశం. నెలకు 12 రూపాయల చెల్లింపుతో రెండు లక్షల రూపాయల ప్రమాద భీమాను కల్పిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

కొత్తగా 6 లక్షల మరుగుదొడ్లను నిర్మిస్తున్నట్లు, స్వచ్చభారత్ కు వచ్చే డొనేషన్లపై 100శాతం పన్నును మినహాయింపును ఇవ్వనున్నట్లు అరుణ్ జైట్లీ వివరించారు. అయితే ప్రస్తుత బడ్జెట్ విజన్ తో కూడిందని మోదీ ప్రశంసలు గుప్పించారు. అయితే మామూలు జనాలను మాత్రం విజన్ కాదు విజువలైజేషన్ కావాలి. నిజానికి నిధులు లేకపోయినా, పలానా అంశానికి మేమిన్ని నిధులను విడుదల చేస్తున్నామని ప్రకటన వస్తే చాలు సంతోషించే వారు చాలా మందే ఉంటారు. కానీ అరుణ్ జైట్లీ ప్రజలను ఊహాలోకంలో తిప్పలేదు. కానీ వారి కళలకు మాత్రం రెక్కలు తొడగలేదు. వారి అంచనాలను అందుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విఫలమైందని నా భావన. కానీ గత బడ్జెట్ లతో పోలిస్తే మాత్రం ఎంతో ముందు చూపుతో కూడిన బడ్జెట్ అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jailtley  financestatement  budget  investment  service tax  cess  achedin  ndagovt  

Other Articles