Motion of thanks to the president speech of modi

Narendra Modi, Lok Sabha, Congress , President, Modi, Swatchbharath, Economy, India, Culture

Narendra Modi is not known to mince his words when it comes to taking on his opponents. While replying to the discussion on the Motion of Thanks to the President's Address in the Lok Sabha, Modi squarely targeted Congress even as the Congress president Sonia Gandhi sat in the audience.

పార్లమెంట్ లో మోదీ మాటల మాయ.. ప్రగతికి బాటలు వేద్దామని పిలుపు

Posted: 02/27/2015 04:27 PM IST
Motion of thanks to the president speech of modi

మోదీ మరో సారి మాటల గారడీ చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాలు తెలుపుతూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. భారతదేశ 1947లో ఏర్పడింది అని చాలా మంది అనుకుంటున్నారని, కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే భారతదేశం ఉందని అన్నారు. దేశంలో ప్రభుత్వాలు దేశాన్ని మార్చవని, ప్రజలే మారుస్తారని అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చెయ్యలేమని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై ఎద్దేవా చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో ఎప్పడో ప్రారంభమైందని అన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బీజం పడిందని తెలిపారు. పథకాల పేర్లు మార్చడం అసలు విషయమే కాదు, పథకాల అమలు అసలు సమస్య అని అన్నారు. పార్లమెంట్ లో మోదీ ప్రసంగం సాగినంత సేపు సభలోని వారు నిశబ్దంగా విన్నారు. రానున్న కొన్ని సంవత్సరాల్లో కొత్త భారతదేశాన్ని చూస్తారు అని అన్నారు. వ్యవస్థల్లో మార్పులు భవిష్యత్తుకు మంచి చేస్తాయని అన్నారు.

భూసేకరణ చట్టంపై విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తూ ఏకతాటిపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కాస్త తగ్గింది. భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశానికి ప్రజల శక్తి సామర్థ్యాలే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దేశంలో చోటు చేసుకున్న సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. భూసేకరణ చట్టంతో వచ్చిన కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని, రైతులకు ఆ చట్టం నచ్చితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదా?అని ప్రశ్నించారు.  భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పులేదన్నారు. ఒకవేళ తప్పులున్నాయని నిరూపిస్తే సరిదిద్దుకుంటామని మోదీ  తెలిపారు.  దేశాభివృద్ధి తమ లక్ష్యమని, చివరకు విజయం సాధిస్తామన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారా రూ. లక్ష కోట్లు సమీకరించామని మోదీ తెలిపారు. పండించే రైతులకు భూసారం తెలియాల్సి ఉన్న భూసార కార్డులు ఇస్తున్నామన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Lok Sabha  Congress  President  Modi  Swatchbharath  Economy  India  Culture  

Other Articles