Venkaih naidu said that railway zone for ap soon

venkaiahnaidu, railwayzone, ap, chandrababu, ndagovt, pmmodi, railways, budget

venkaih naidu said that railway zone for ap will arrive. ap hope for new railway zone for the state but railway minister didnt announce the zone. now central minister venkaih naidu announce that ap will get railway zone.

ఏపికి రైల్వేజోన్ వస్తుంది.. నిరాశ వద్దు: వెంకయ్య నాయుడు

Posted: 02/27/2015 03:33 PM IST
Venkaih naidu said that railway zone for ap soon

ఏపి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని అందరు అనుకున్నా పరిస్థితులు మాత్రం అలా అనిపించడం లేదు. రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చెయ్యాలని ఏపి ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రం నుండి మాత్రం అనుకున్నంత నిధులు రాలేదు. పైగా ఒక్క మీ రాష్ట్రంలోనే కాదు పద్నాలుగు రాష్ట్రాల్లో లోటుబడ్జెట్ ఉందని తెలిపింది. అలా కేంద్రం ముందు నుండి ఏపి ఆశలపై నీళ్లు జల్లుతూ వస్తోంది. కానీ తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన మాత్రం కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.

 రైల్వేజోన్ విషయంలో ఏపీ నిరాశ పడాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రైల్వే జోన్ వచ్చే అవకాశం వుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భరోసా ఇస్తున్నారు. ఏపీకి రైల్వే జోన్ వచ్చి తీరుతుందని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దానిని ఇకనుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చుతున్నట్టు వెంకయ్య ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ఎక్స్ప్రెస్ వస్తుందన్నారు. అది విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiahnaidu  railwayzone  ap  chandrababu  ndagovt  pmmodi  railways  budget  

Other Articles