Gdp to grow between 8 1 8 5 next year economic survey

Economic Survey Arun Jaitley Arvind Subramanian he economy growth

The Indian economy is expected to grow between 8.1-8.5% next year, the Economic Survey said.Tabled in Parliament on Friday by finance minister Arun Jaitley and authored by a team led by chief economic advisor Arvind Subramanian, the annual report card on the state of the economy said the growth should now rise further and double digit expansion was a possibility.

సబ్సీడీల వల్ల ప్రయోజనం లేదు: ఆర్థిక సర్వే

Posted: 02/27/2015 02:49 PM IST
Gdp to grow between 8 1 8 5 next year economic survey


అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. భారతదేశం అభివృద్ది వైపుకు పరుగులు తీస్తోందని, రానున్న రోజుల్లో అది సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. భారత్ ఆర్థిక వృద్ది రెండంకెలకు చేరే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్త చేశారు. అయితే సబ్సిడీలు అనుకున్న లక్ష్యాలను చేరడం లేదని, సబ్సిడీలలో కోత పెట్టడం మంచిది అన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. జిడిపిలో 4.24 శాతంగా ఉన్న సబ్సిడీలు నికరంగా 3,78,000 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తోందని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్తగా ప్రవేశపెడుతున్న పధకాలను బ్యాలెన్స్ చేస్తు ముందుకు తీసుకెళ్లాలని అరుణ్ జైట్లీ వెల్లడించారు.

2014-15 లో 4.1 గా ఉన్న ఆర్థిక లోటును 2015-16 లో 3.6 కు చేర్చాలని కోరారు. ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలకు దిగుతోందని అన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ తన వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరించుకుంటోందని, భారత మార్కెట్లపై విదేశీయులు కూడా ఆసక్తిగా ఉన్నారని అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 8.1 నుండి 8.5 శాతం ఆర్థిక వృద్ది నమోదవుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశంలో పొదుపు మొత్తం పెరుగుతోందని, విదేశీ మారక నిల్వలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. మొత్తానికి భారత ఎకానమీ తొందరలోనే ఎగరడానికి సిద్దంగా ఉందని జైట్లీ స్పష్టం చేశారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles