Lacks vision road map to execute ideas says opposition

Lacks vision, road map to execute ideas, says Opposition, mallijarjun kharge, dinesh trivedi, government to invest 8.5 lakh crore in railways, railway budget hikes freight charges, suresh prabhu to tap jvs to put railways on track, no new trains on tracks, Rail transport must be made reliable, Rail transport must be made comfortable, Suresh Prabhu debut railway budget, Rail transport should meet global standards, no increse in passenger train fares, railway budget 2015, Railway Minister Suresh Prabhu, suresh prabhu tabled railway budget,Suresh Prabhu no hike in the fares, rail budget-2015, suresh prabhu, venkaiah naidu, railway budget highlights, rail budget 2015, Economy, Indian Railways, Narendra Modi, trains, WiFi

Railway Minister suresh prabhu debut budget lacks vision and road map to execute ideas says opposition

ఇది మాటల బడ్జెట్, ఆచరణనకు నోచుకోదు: విపక్షాలు

Posted: 02/26/2015 03:42 PM IST
Lacks vision road map to execute ideas says opposition

లోక్సభలో ఇవాళ తొలిసారిగా రైల్వే మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి. సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం మాటలతో మభ్యపెట్టే రైల్వే బడ్జెట్ అని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రైల్వే బడ్జెట్ పై ఆయన స్పందించారు. 'రైల్వే బడ్జెట్ దిశానిర్ధేశం లేకుండా వుందని విమర్శించారు. బడ్జెట్ లో పేర్కొన్న అంశాల అమలుకు కేవలం ప్రస్తావనకే పరిమితమైందన్నారు ప్రభుత్వం మాటలతో మాయలు చేస్తుందన్నారు.

బడ్జెట్ అమలుకు, వనరుల్ని పెంచుకోవడానికి ప్రణాళికలు ఏమీ లేవు. విజన్ డాక్యుమెంట్‌లో విషయమేమీ లేదని విమర్శించారు. బడ్జెట్లో కొత్త రైళ్లు లేకపోవడం భారత చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు' అన్నారు. ఇదింతా ఊహాజనిత బడ్జెట్ గా ఖార్గే వ్యాఖ్యానించారు. బడ్జెట్ ఆసాంతం అలోచనలతో నిండి వుందని, అయితే అలోచనలు ఎలా అమలు చేస్తారన్నది మాత్రం వివరించలేదని చెప్పారు. బడ్జెట్ మొత్తం ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం పద్దతిలో వుందని, ఎక్కడా ప్రజాహితం కనబడలేదని విమర్శించారు.

రైల్వే బడ్జెట్లోని అంశాలు చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయిగాని ఆచరణ సాధ్యం కావని తృణమూల్ కాంగ్రెస్ నేత, కేంద్ర రైల్వేశాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది అన్నారు. రైల్వే పునాదులను ముందుగా బలోపేతం చేయాల్సిన అవసరం వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యాల కల్పన కన్నా ప్రస్తుతం వున్న సౌకర్యాలను కొనసాగిస్తూనే పునాదులను పటిష్టం చేయాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రైల్వేల నిర్వహణను ప్రస్తుత పద్దతిలోనే కొనసాగించాలని, అలా కాని పక్షంలో యావత్ దేశ సమగ్రతను ప్రశ్నిస్తుందన్నారు. రరైల్వేలను జీవనాడులని ఆయన సూచించారు.  రైల్వే బడ్జెట్ ఎయిర్ ఇండియా మార్గంలో ప్రయాణించిందని ఎద్దేవా చేశారు. భాజపా ప్రభుత్వం గాలిలో మేడలు కడుతోందని విమర్శించారు. బుల్లెట్ రైలు మంచి ఆలోచన అన్న దినేష్ త్రివేది.. దాని నిర్వహణకు కిలోమీటరు మూడు వందల కోట్ల రూపాలను వెచ్చించాల్సి వుంటుందని, దానిని ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు.

కాగా, దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబడ్జెట్ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వేబడ్జెట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. రైతుల సౌకర్యం కోసమూ కొన్ని చర్యలు తీసుకున్నామని, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వికలాంగులు, అంధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రతిపాదించినట్లు వివరించారు.


జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway budget 2015  Suresh Prabhu  mallikarjun kharge  dinesh trivedi  

Other Articles