Ap implimenting tn liquor policy from july

tamilnadu liquor policy from july in ap, ap government to launch liquor business, ap implimenting tamilnadu liquor policy, no auction of liquor shops, government in liquor business, AP implimenting TN liquor policy, liquor policy, andhra pradesh, tamilnadu, liquor business

andhra pradesh government to launch liquor business on its own by implimenting tamilnadu liquor policy in the state

జులై నుంచి తమిళానాడు తరహా కొత్త ఎక్సైజ్ విధానం..

Posted: 02/11/2015 08:22 AM IST
Ap implimenting tn liquor policy from july

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఈ జూలై మాసం నుంచి స్వయంగా మద్యం వ్యాపారంలోకి దిగనుంది. ఈ ఏడాది జూన్ మాసంతో రాష్ట్రంలోని 4371 మద్యం దుకాణాలను లైసెన్సుల రిన్యూవెల్ ను నిలివి వేయనుంది. ఇకపై మద్యం దుకాణాల వేలాన్ని నిలిపివేసి స్వయంగా వ్యాపారంలోకి అడుగుపెట్టి లాభాలను ఆర్జించాలని భావిస్తోంది. తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. ఇందుకోసం కమీషన్ విధానాన్ని అవలంభించనుంది. కమీషన్ విధానాన్ని అనుసరించి రేషన్ షాపుల తరహాలో ఒక్కో మద్యం దుకాణంలో ఇద్దరేసి డీలర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు.

ఆ డీలర్లు మద్యం విక్రయిస్తారు. ఇందుకోసం వారికి కమీషన్ చెల్లిస్తారు. అంటే ఎంత ఎక్కువ మద్యం విక్రయిస్తే అంత ఎక్కువ కమీషన్ డీలర్లకు వస్తుంది. తమిళనాడులో మద్యం దుకాణానికి అనుబంధంగా బార్లు కూడా ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో కూడా అదే విధానం అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి తమిళనాడు తరహా నూతన ఎకై్సజ్ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.పస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.3,738 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా జనవరి నాటికి రూ.2,998 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో బెల్ట్‌షాపుల విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పిన బాబు  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  నెపంతో అధికారికంగా మద్యం షాపులను తెరవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : liquor business  andhra pradesh government  

Other Articles