Telugu content

heroine rambha, rambha gold ornaments stolen, rambha ornaments stolen by relatives, relatives stolen rambha ornaments, rambha brother srinivas, srinivas complaints to banjara hills police, srinivas complaints on his wife, virupumbakam police, rambha latest news, rambha brother dowry case,

heroine rambha brother complaints to banjara hills police station

రంభ ఆభరణాలు అపహరణ..ఇంటిదోంగలపై పిర్యాదు

Posted: 02/01/2015 04:46 PM IST
Telugu content

ఈ మధ్య అవకాశాలు మరీ మందగించడంతో.. వున్న ఆస్తిపాస్థులను సక్రమంగా కనిపెట్టుకునే పనిలో పడింది సినీ నటి రంభ. అందుకనేనేమో తన బంగారు, వజ్రాల నగల అపహరణకు గురయ్యాయని తెలుసుకుని ఏకంగా దొంగలపై పిర్యాదు చూడా చేసింది. చిత్రమేమిటంటే రంభ బంగారు, వజ్రాల నగలు దోచుకెళ్లింది ఏ ఘరణా దోంగో కాదట.. ఇంటి దొంగలేనట. రంభ అక్క, వదినలు తన నగలు కాజేశారని ఏకంగా పోలీసులకు పిర్యాదు కూడా చేయించింది., ఈ మేరకు తాము చెన్నై విరువుంబాకం పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ తెలిపారు.

తన భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలు కాజేయడమే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించారు.

తన కుమారుడిని ఏడాదిగా చూపించడం లేదని పశ్చిమ మండలం డీసీపీకి ఫిర్యాదు కూడా చేశానని, ఆ కేసు విషయమై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల నుంచి రంభ కెనడాలో ఉందని ఇటీవల రెండు నెలలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిందని తెలిపారు. గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని  పల్లవి,  శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని, ఈ మేరకు వారిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని శ్రీనివాస్ తెలిపారు.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rambha  ornaments  police complaint  srinivas  

Other Articles