Telemarketer saves woman s life

Telemarketer saves woman's life, Telemarketer hears bloodcurdling screams, Telemarketer alerts oregon police, telemarketer heard muffled cries, domestic violence, crime against women, violence against women, Nevada telemarketing call center, husband attempting to murder his wife, Tina Garcia of Americare Health and Nutrition, Walter Ruck arrested on assault charges

Telemarketer saves woman's life after hearing her bloodcurdling screams down the phone and alerting police to brutal domestic attack 900 miles away

మహిళ ప్రాణాలను కాపాడిన కాల్ సెంటర్

Posted: 01/31/2015 08:44 PM IST
Telemarketer saves woman s life

వ్యాపార సంస్థల కాల్ సెంటర్ల నుంచి ఫోన్ కాల్స్‌ చేసే టెలీ మార్కటింగ్ సిబ్బంది.. అందరికి ఫోన్లు చేస్తారు. కానీ వీళ్లు తప్పకుండా తమ వస్తువును తీసుకుంటారన్న నమ్మకం వున్నవారితో మాత్రమే సమయాన్ని కేటాయించి మాట్లాడుతుంటారు.  మరోలా చెప్పాలంటే.. తమ వస్తువుపై ఆసక్తిని కనబర్చే వారికే ఎక్కువ సమయాన్ని కేటాయించి.. వారితో తమ ఉత్పత్తులకు గిరాకీ చేయించుకుంటారు. అయితే తమ నిత్యం వ్యవహారాల్లో ఎంతో మంది చివాట్లను, చిర్రబుర్రులను ఎదుర్కొనే వాళ్లు కూడా అనేకం. కానీ ఇక్క ఒక టెలికాలర్ మాత్రం లాస్ వెగాస్ ప్రజల ఆదరాభిమానాలను చూరొగోంది. తన వ్యవహర తీరుతో ప్రజల నుంచి వేనోళ్ల పోడగ్తలను అందుకుంది. ప్రశంసల జల్లు ముంచెత్తింది.. ఎందుకంటారా..?

లాస్ వేగస్ నుంచి 1448 కిలోమీటర్ల దూరంలోని ఓరగాన్ (లెబనాన్) పట్టణానికి అమెరికేర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాల్ సెంటర్ నుంచి చమెల్లీ మ్యాక్ ఎలోరి అనే ఉద్యోగిని తన విధి నిర్వహణలో భాగంగా ఇటీవల లెబనాన్‌లోని ఓరెగాన్ పట్టణంలోని ఓ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. అవతలి వైపు నుంచి 'హలో' అని జవాబుకు బదులుగా... రక్షించండి.. రక్షించండీ అంటూ ప్రాణభీతితో ఓ యువతి చేసిన ఆర్తనాదాలు  వినిపించాయి. ఫోన్ లో యువతి అర్థానాథాలు విన్న ఎలోరి కొద్దిసేపు షాక్ కు గురై.. వెంటనే తెరుకుని.. ఫోన్ పెట్టేయకుండా తన సూపర్‌వైజర్ టినా గ్రేషియాకు ఈ విషయం తెలియజేసింది. అతను వెంటనే విషయాన్ని కంపెనీ సీఈవో మారియో గోంజాలెజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఫోన్‌లో వినిపిస్తున్న ఓ యువతి ఆర్తనాదాలు విన్నారు. వెంటనే ఈ విషయాన్ని ఓరేగాన్‌లోని స్థానిక పోలీసులకు తెలియజేయాలని నిర్ణయించుకుని.. సమాచారాన్ని అక్కడికి చేరవేశారు.

మారియో ఫోన్‌కాల్‌ను రిసీవ్ చేసుకున్న ఓరెగాన్ పోలీసులు తక్షణమే స్పందించి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆపదలో ఉన్న యువతి చిరునామాను కనుక్కొని ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే 33 ఏళ్ల వాల్టర్ వారెన్ జాన్‌రుక్ తన భార్యను వెనక నుంచి గట్టిగా పట్టుకొని హింసిస్తుండడం కనిపించింది. పోలీసులు అతన్ని రివాల్వర్లతో బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. దిండ్లతో, బ్లాంకెట్లతో తనను ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నం నుంచి తప్పించుకుంటే గుండెకు రివాల్వర్‌ను ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించాడని, అదే సమయంలో తన వెనుక జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగిందని, దాన్ని జాన్‌రుక్‌కు తెలియకుండా ఆన్ చేశానని బాధితురాలు జరిగిన విషయాన్ని వివరించారు. నిందితుడిని లిన్ కౌంటీ జైలుకు తరలించిన ఫోలీసులు అమెరికేర్ హెల్త్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి సకాలంలో స్పందించిన కెంపెనీ సీఈవో, ఉద్యోగులను ప్రశంసించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : call centre call  life saver call  murder attempt  

Other Articles