Co pilot was flying airasia flight 8501

Co-pilot flying AirAsia Flight 8501, AirAsia Flight 8501, Air Asia pilot left the seat, air asia flight crash, AirAsia Flight crashed into Java Sea, 162 boarded airasia flight crashed, air asia flight data recorder, picture before the plane crash, Air asia Airbus A320 enroute to Singapore,

The co-pilot was at the helm of AirAsia Flight 8501 before it crashed into the Java Sea with 162 people aboard, sources familiar with the investigation told

ఎయిర్ ఏసియా ప్రమాదానికి ఫైలట్ నిర్లక్షమే కారణమా..?

Posted: 01/31/2015 07:35 PM IST
Co pilot was flying airasia flight 8501

ఇండోనేషియాలోని జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. విమానం సముద్రంపై దిగేంత వరకు భద్రంగానే ఉన్నట్లు 'ది మిర్రర్' కథనంలో పేర్కొంది. 162 మంది ప్రయాణికులతో ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతున్న ఎయిర్ బస్ ఎ320 జెట్ విమానం గత డిసెంబర్ 28న జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న వారంతా జలసమాధి అయ్యారు. విమానం బ్లాక్ బాక్సు లభ్యం కావడంతో దానిని డిటెక్ట్ చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్న అధికారుల నుంచి లభ్యమైన సమాచారం మేరకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విమానం సముద్రంపై దిగేంత వరకు ఎటువంటి ప్రమాదం జరుగలేదని  'ది మిర్రర్' తెలిపింది. నీళ్లపై కొంత దూరం ప్రయాణించిన తరువాత విమానం మునిగిపోయనట్లు ఆ కథనంలో పేర్కొంది. మునిగిపోక ముందు విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడం వల్లే ఈఎల్టీపై ప్రభావంలేదని తెలిపింది. విమానం కెప్టన్ తన స్థానం నుంచి లేచి వెళ్లిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్న సహ ఫైలట్ విమానాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesia  AirAsia plane  java sea  crash  The Mirror  

Other Articles