Hyderabad young women joins isis

Hyderabad young women joins isis, Hyderabad women joins isis, Islamic State of Iraq and Syria, Hyderabadi women, Hyderabadi in ISIS, ISIS links in Hyderabad, Intelligence department, Telangana Intelligence department, Telangana police.

Hyderabad young women joins isis, later comes back to home town with the help of family members after she was insisted to cook for terrorists.

ITEMVIDEOS: ‘ఇస్లామిక్ స్టేట్’లో హైదరాబాద్ యువతి గరిటే తిప్పిందా..?

Posted: 01/31/2015 12:14 PM IST
Hyderabad young women joins isis

ఇందుగలడు, అందులేడని, సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు నారాయణడు అన్ని దేవుళ్ల ప్రస్తావన సందర్భంగా చెప్పుకోవడం పరిపాటే. కానీ ప్రస్తుత తరుణంలో దేశంలో ఏ రాష్ట్రంలో వెతికినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు కనబడుతున్నారు. విచిత్రమేమిటంటే ఉగ్రవాదంలోకి ఇన్నాళ్లు చదువుకున్న యువకులు మాత్రమే ఆకర్షితులయ్యేవారు. కానీ తాజాగా వస్తున్న మార్పుల నేపథ్యంలో మహిళలు, యువతులు కూడా ఉగ్రవాదంపైవు అకర్షితువుతున్నారు. ఉగ్రవాద సంస్థలో చేరి ఉగ్రవాదులుగా మారుతున్నారు.

ఈ కోవాలోనే ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో హైదరాబాద్‌కు చెందిన యువతి చేరి.. అక్కడి అనుకున్నది తల్లకిందలు అయ్యే సరికి డామిట్ కథ అడ్డం తిరిగిందనుకుంటూ.. కుటుంబ సభ్యుల సాయంతో ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ నిఘా విభాగం గుర్తించింది. రెండు నెలలు పాటు ఇరాక్ లో వున్న యువతి చేతికి గన్ ఇస్తారనుకుంటే.. గరిట చేతిలో బెట్టారు. దీంతో చేసేది లేక ఇటీవలే తిరిగి వచ్చినట్లు సమాచారం.

ఆ యువతి కుటుంబం పదేళ్ళ కిత్రం హైదరాబాద్ నుంచి దోహా వెళ్లి అక్కడే స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆమె వివరాలు తెలియటంతో యువతి చెప్పే విషయంలో నిజానిజాలను నిర్థారించేందుకు నిఘా విభాగం అధికారులు రంగంలోకి దిగారు. అమెను విచారిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి మరెవరైనా ఐఎస్‌లో చేరేందుకు వెళ్లారా? ఐఎస్‌లో చేరికలకు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులెవరు అనే అంశాలపై నిఘా విభాగం దృష్టి సారించింది. ఈ యువతి ద్వారా ఐఎస్ఐఎస్లో చేరేందుకు యత్నిస్తున్న మరో ఆరుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవలి కాలంలో ఒక్క హైదరాబాద్‌ నుండే రెండు మూడు నెలల కాలంలో దాదాపు 42 మంది యువకులు వివిధ మార్గాల్లో వెళుతూ సరిహద్దుల్లో భద్రతా దళాలలకు పట్టుబడ్డారు. వీరే కాకుండా హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా ఐఎస్‌ఐఎస్‌ సంస్థలో చేరేందుకు సిద్ధమై, ఇరాక్‌, సిరియాకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధపడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం గుర్తించింది. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళుతూ ఇప్పటికే సల్మాన్ మొయిద్దీన్ పట్టుబడి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉగ్రవాద కార్యకలాపాల్లోకి పెద్దఎత్తున యువతను ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ నిఘా విభాగం ఈ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవుతున్న యువతను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఐఎస్‌పై నిఘా కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె ద్వారా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Intelligence Bureau  women terroroist  telangana police  

Other Articles