Aam aadmi bjp party leaders contestants delhi elections nominations

aam aadmi party news, bjp party news, delhi assembly elections, delhi assembly nominations, aap party news, bjp party latest news, crime politicians, crime politics, delhi politics

aam aadmi bjp party leaders contestants delhi elections nominations : aam aadmi party and bjp parties given tickets to crime peoples.

నేరచరిత నేతలతో నిండిపోయిన ఆప్-బీజేపీ పార్టీలు!

Posted: 01/31/2015 11:34 AM IST
Aam aadmi bjp party leaders contestants delhi elections nominations

సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, దారుణాలను పూర్తిగా ఎండగడతామంటూ సొంత డప్పు వాయించుకుంటున్న ఆప్, బీజేపీ పార్టీలు వాటన్నింటికీ కేరాఫ్ అడ్రస్’గా నిలుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు న్యాయం జరిగేలా హామీ ఇస్తామంటూ చెప్పుకుంటున్న ఆయా పార్టీలే గతంలో సామాన్య ప్రజలపై నేరాలకు పాల్పడిన అభ్యర్థులకు సీట్లు ఇచ్చేశాయి. ‘క్రైమ్’ అనే పదాన్ని తుడిచిపెట్టేస్తామంటూ వాగ్దానాలు చేస్తున్న పార్టీలే నేరచరిత గల అభ్యర్థులనే ప్రజల ముందు మంత్రులుగా నిలబెట్టిస్తున్నారు. అంటే.. పార్టీ గెలుపొందాలనే స్వార్థం కోసం అంగ, అర్థ బలాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నమాట! మరి.. ఇక్కడ న్యాయపోరాటం ఎక్కడుంది?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీలు నేరచరిత కలిగిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాయి. రాజకీయ ప్రక్షాళన చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఆప్ పార్టీ టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నవారే వున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. తామూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా ఆప్ పార్టీ కంటే ఇంకా ఎక్కువ నేరచరితగల అభ్యర్థులకే టికెట్లు పంచిపెట్టింది. బీజేపీ టికెట్లు ఇచ్చిన మొత్తం అభ్యర్థుల్లో 29 మంది క్రిమినల్ కేసుల్లో మొగ్గుతున్నవారే! ఇక కాంగ్రెస్ టికెట్లు ఇచ్చినవారిలో 21 మందికి నేరచరిత వుంది. ఇదీ.. రాజకీయ పార్టీల అసలు బాగోతం! ఇంకో విషయం ఏమిటంటే.. ఢీల్లీ ఎన్నికల్లో మొత్తం 673 మంది నామినేషన్లు వేయగా.. అందులో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు వున్నట్లు తేలింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aam aadmi party news  bjp party news  delhi assembly nominations  

Other Articles