Baba ramdev patanjali pharmacy divya putrajeevak seed controversy haryana state

baba ramdev controversy, baba ramdev products, baba ramdev divya putrajeevak seed, divya putrajeevak seed, baba ramdev health products, baba ramdev latest news, patanjali pharma, patanjali medial

baba ramdev patanjali pharmacy divya putrajeevak seed controversy haryana state : baba ramdev creates another sensation by his another product divya putrajeek seed. By drinking this.. definitely baby boy will born who don't have sons.

‘బాబా రాందేవ్’ మందు తాగితే.. మగబిడ్డ గ్యారెంటీ!

Posted: 01/30/2015 12:48 PM IST
Baba ramdev patanjali pharmacy divya putrajeevak seed controversy haryana state

యోగా గురువు బాబా రాందేవ్ అప్పుడప్పుడు పెనుసంచలనాలతో తెరపైకి వస్తుంటారు. ఆమధ్య ఎన్నికల నేపథ్యంలో తనదైన రీతిలో వ్యాఖ్యానాలు చేసి సంచలనం సృష్టించిన ఈ బాబా.. తాజాగా మరో వివాదంతో వార్తల్లోకెక్కారు. బాబా రాందేవ్ పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న ‘దివ్య పుత్రజీవక్ సీడ్’ అనే మందును వాడితే.. ఖచ్చితంగా మగబిడ్డలు పుడతారన్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. సంతానం లేని దంపతులకు ఆ సమస్య తగ్గి పండంటి బిడ్డకు జన్మనిస్తారని రాందేవ్ సందేశాలు పంపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

బాబా రాందేవ్ మెడికల్ స్టోర్’లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ మందు తాగితే సంతాన సమస్యల తొలిగిపోయి, మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చినట్లుగా తెలిపారు. ఈ మందువల్లే తమకు మగబిడ్డ పుట్టినట్లుగా కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. సంతానం లేక బాధపడుతున్నవారు ఈ మందును కొనుగోలు చేసి తాగిన అనంతరం వాళ్లకు సంతానం కలిగినట్లు మరికొందరు చెప్పినట్లుగా ఆయన అన్నారు. పైగా.. పతంజలి మందుల దుకాణాల ద్వారా లభించే ఈ ఔషధం ప్యాకెట్ ధరం కేవలం రూ.35 లేనంటూ ఆయన స్పస్టం చేశారు. దీంతో.. హర్యానాలో ఈ మందుకు ఫుల్లుగా గిరాకీ వుందట! ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి పంపిన మందు మొత్తం ఇప్పటికే విక్రయం అయిపోయిందట! కొందరైతే ముందుగానే ఆర్డర్ చేసి పెట్టుకున్నారని, దుకాణాల దగ్గర క్యూలో నిలబడ్డారని వార్తలొస్తున్నాయి.

ఇదిలావుండగా.. బాబా రాందేవ్ ప్రవేశపెట్టిన ఈ మందును పరిశీలించిన వైద్యులు.. అసలా మందుతో సంతానం కలుగుతుందన్న గ్యారెంటీయే లేదని తేల్చి చెబుతున్నారు. ‘దివ్య పుత్రజీవక్ సీడ్’ మందు తాగితే మగబిడ్డ కాదుకదా.. అసలు సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా లేదని నిపుణులు తెలుపుతున్నారు. అధిక డబ్బులు ఆర్జించేందుకు మగబిడ్డ పుడతాడనే అసత్య ప్రచారాలు చేస్తూ మందులను విక్రయిస్తున్నారని అంటున్నారు. అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా.. రాందేవ్ కు వున్న ఫాలోయింగ్ ముందు వీళ్ల మాటలు చెల్లకపోగా.. ఆ మందులు ఇబ్బడిముబ్బడిగా అమ్ముడుపోతున్నాయి. దీంతో.. ఇంకా దేశంలో మూఢనమ్మకాలు ప్రబలుతూనే వున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba ramdev products  divya putrajeevak seed controversy  patanjali pharma  

Other Articles