Bjp central minister rajeev pratap rudi counter questions arvind kejriwal

arvind kejriwal, rajeev pratap rudi, kiran bedi, delhi elections, congress party, bjp party, rahul gandhi, narendra modi, pratap rude arvind kejriwal, aam aadmi party ministers, bjp party ministers

bjp central minister rajeev pratap rudi counter questions arvind kejriwal : the central minister rajeev pratap rude has questioned arvind kejriwal.

బేజేపీ ఇచ్చిన కౌంటర్ కి కుప్పకూలిన కేజ్రీ‘వాల్’...

Posted: 01/30/2015 10:49 AM IST
Bjp central minister rajeev pratap rudi counter questions arvind kejriwal

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటలయుద్ధం వాడీవేడీగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే మోదీ బీజేపీ ప్రచారంలో పాల్గొనగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అభ్యర్థుల ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎప్పటినుంచో చేతిలో చీపురు పట్టుకుని ప్రజల ఇంటిముందు ఊడ్చుకుంటూ వస్తూనే వుంది.

ఇకపోతే.. ఆప్ ఢిల్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ పార్టీ మీద ఆరోపణలు చేయడంతోపాటు ప్రతిరోజూ ఆ పార్టీకి 5 ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. బీజేపీ బహిరంగ చర్చలో పాల్గొని తాను అడిగే సూటిప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిందిగా కేజ్రీ కోరారు. అయితే.. కేజ్రీ ప్రతిపాదించిన ఈ ప్రశ్నల నియమాన్ని బీజేపీ టార్గెట్ చేస్తూ ఆ పార్టీ ఆప్’కే కొన్ని ప్రశ్నలను సంధించింది. కేజ్రీవాల్ తనను తాను ఆమ్ ఆద్మీగా, నిజమైన నాయకుడిగా పరిగణించుకుంటుంటే.. తాము అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పే దమ్ముందా అంటూ సవాల్ విసురుతూ.. బీజేపీ పార్టీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ 5 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు ఇలా..

1. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ సహకారం తీసుకోమని వాగ్దానం చేసిన కేజ్రీవాల్.. అప్పుడు మాట మార్చి ఎందుకు సహాయం తీసుకున్నారు?

2. షీలా దీక్షిత్ పై కేసు పెడతామని చెప్పిన కేజ్రీవాల్.. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె మీద ఎందుకు విచారణ జరపలేదు?

3. 2013 ఏప్రీల్ 13వ తేదీ ఇచ్చిన అఫిడవిట్’లో వీఐపీ రక్షణ తీసుకోమని ప్రకటించిన ఆప్.. జెడ్ ప్లస్ కేటగిరి భ్రదతను ఎందుకు ఒప్పుకుంది.

4. కేజ్రీవాల్ సీఎంగా వున్నప్పుడు ఢిల్లీ మెట్రో, తన వేగన్R కార్ నుంచి రామ్ లీలా మైదానానికి చేరుకున్న ఆయన.. మంత్రులకు అత్యాధునిక వాహనాలు ఎందుకు ఏర్పాటు చేశారు?

5. ప్రైవేట్ జెట్లను ఉపయోగించడం తన సిద్ధాంతంలో లేదని పేర్కొన్న కేజ్రీవాల్.. సీఎం అయిన తర్వాత అందులో ఎందుకు ప్రయాణించారు?

ఇలా ఈ విధంగా రూడీ ఆప్ నేత కేజ్రీవాల్’కి సంధించారు. ఈ ప్రశ్నలను విన్న తర్వాత ఖంగుతిన్న కేజ్రీవాల్.. వాటికి సమాధానం ఇవ్వకుండా తన మొండి వైఖరినే ప్రదర్శిస్తున్నారు. బీజేపీని తనతో బహిరంగ చర్చకు దిగమంటే ఎందుకు తలాతోకా లేని ప్రశ్నలతో సమయం వృధా చేస్తోందంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తుతున్నారు. ఏదైతేనేం.. బీజేపీ అడిగిన ప్రశ్రలకు కేజ్రీ‘వాల్’ కుప్పకూలిందంటూ అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ.. కేజ్రీ ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తారో..? లేదో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles