Andhra telangana high court stay ntv broadcasting the ministry of information and broadcasting

ntv news, ntv ban news, ntv cinecolors programme, ntv director ramadevi, andhra pradesh high court, telangana high court, The Ministry of Information and Broadcasting, ntv broadcasting problems

andhra telangana high court stay ntv broadcasting The Ministry of Information and Broadcasting : andhra telangana high court stay ntv ban for four weeks.

NTV ప్రసారాల నిషేధంపై హైకోర్టు ‘కౌంటర్’

Posted: 01/29/2015 10:28 AM IST
Andhra telangana high court stay ntv broadcasting the ministry of information and broadcasting

గతంలో ఎన్టీవీ న్యూస్ ఛానెల్’లో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రసారమయ్యే ‘సినీకలర్స్’ ప్రోగ్రామ్’లో అసభ్యత, అశ్లీలత ఎక్కువగా వుందని ఫిర్యాదు అందిన మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించిన అనంతరం ఎన్టీవీ ప్రసారాలను ఓ వారంరోజులపాటు(ఫిబ్రవరి 3-10) నిలిపివేస్తున్నట్లు యాజామాన్యానికి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ లిమిటెడ్ (ఎన్టీవీ) సంస్థ డైరెక్టర్ టి.రమాదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2012లోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి, కేంద్రానికి రాతపూర్వకంగా వివరణ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు వారంరోజులు నిషేధం విధించడం సరికాదని ఆ పిటిసన్’లో పేర్కొన్నారు.

ఎన్టీవీ యాజమాన్యం వేసిన పిటిషన్’ను పరిశీలించిన హైకోర్టు.. కేంద్రం అమలు చేయనున్న ఆ ఛానెల్ నిషేధంపై స్టే విధించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టి తెలుపుతూ.. కేంద్రం ఉత్తర్వులను నాలుగు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు తీర్పు చెప్పారు. అంతేకాదు.. ఈ విషయానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర శాఖకు నోటీసులు జారీ చేశారు. దీంతో.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 10 వరకు ఎన్టీవీ ప్రసారాలపై విధించిన నిషేధం చెల్లదన్నమాట! అంటే.. సాధారణంగా ఆ ఛానెల్ ప్రసారాలు కొనసాగుతాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntv ban news  andhra telangana high court  the ministry of broadcasting  

Other Articles