Arvind kejriwal campaigns delhi assembly elections election commission

arvind kejriwal news, arvind kejriwal latest news, delhi assembly elections, arvind kejriwal controversial comments, bjp party news, congress party news, election commission, arvind kejriwal election commission, aam aadmi party news

arvind kejriwal campaigns delhi assembly elections election commission : delhi former cm arvind kejriwal repeating controversial comments in his campaigns.

ఈసీ హెచ్చరించినా.. వదలనంటున్న కేజ్రీవాల్!

Posted: 01/28/2015 04:59 PM IST
Arvind kejriwal campaigns delhi assembly elections election commission

ఢిల్లీలో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ నాయకులందరూ తమతమ పార్టీల గురించి డప్పు వాయించుకుంటున్న విషయం విదితమే! ‘మా పార్టీకి ఓటేయ్యండి’ అంటూ ఒకరంటే.. ‘ఆ పార్టీకి ఓటెయ్యొద్దు’ అంటూ మరికొందరు వాదోపవాదనలు చేసుకుంటున్నారు. ఒకరిపైమరొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. అయితే.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తనదైన రీతిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిపోతున్నారు. పిచ్చి పలురకాలు అన్నట్లుగా గతంలో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలను మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తున్నారు.

ఇటీవలే తన పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా.. ‘‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! అంతేకాదు.. మరికొన్ని సందర్భాల్లోనూ ఆయన అవే వ్యాఖ్యలను పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యల విషయంలో ఆగ్రహానికి గురైన ఎన్నికల సంఘం (ఈసీ) ఆయనను గట్టిగా హెచ్చరించింది. మళ్లీ ఇలాంటి మాటల వినిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుందని తెలిపింది. ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమైన అటువంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే తాము సహించబోమని ఈసీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది.

అయితే కేజ్రీవాల్ మాత్రం ఈసీ హెచ్చరికలను పట్టించుకోకుండా మళ్లీ ఆ మాటలనే పునరావృతం చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగిన ర్యాలీల్లోనూ కేజ్రీవాల్ ఆ వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. కేజ్రీవాల్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం.. ఈసీకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  delhi assembly elections  bjp party news  

Other Articles