Jabardast show comedian venu arrest hyderabad ou police officers

jabardast comedian venu, comedian venu arrested, jabardast venu arrest, comedian venu news, comedian venu movies, comedian venu attack, jabardast comedian venu attack, hyderabad ou police

jabardast show comedian venu arrest hyderabad ou police officers : tollywood and jabardast show comedian venu arrested on tuesday night by hyderabad ou police officers.

‘జబర్దస్త్’ కమెడియన్ వేణుని అరెస్ట్ చేసిన పోలీసులు...

Posted: 01/28/2015 08:45 AM IST
Jabardast show comedian venu arrest hyderabad ou police officers

ఓవైపు సినిమాలతోబాటు ‘జబర్దస్త్’ కామెడీ షోలోనూ కమెడియన్’గా దూసుకుపోతున్న వేణును మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. కామెడీ పేరిట ఓ కులవర్గాన్ని కించపరిచేవిధంగా వేణు వ్యవహరించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

కొన్నాళ్లకిందట ‘జబర్దస్త్’ కామెడీ షోలో వేణు, అతని బృందం కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఓ స్కిట్ రెడీ చేశారు. ఆ స్కిట్ చేసి ప్రేక్షకులను బాగానే నవ్వించాడు కానీ.. ఓ కులవర్గ ఆగ్రహానికి గురయ్యాడు. తమ కులాన్ని, వృత్తిని కించపరిచేవిధంగా వేణు వ్యవహరించాడంటూ అతనిపై ఓ కులసంఘం నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. వేణును అరెస్ట్ చేశారు.

ఇటీవలే ఫిల్మ్ నగర్’లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేసిన సంగతి విదితమే! మహిళలను, తమ వృత్తిని, కులాన్ని కించపరిచేవిధంగా స్కిట్ చేసినందుకే తాము అతడిపై దాడికి పాల్పడ్డామని పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jabardast comedian venu arrest  hyderabad police  telugu comedy shows  

Other Articles